ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

MP Chamala Kiran Kumar Reddy: ఎమ్మెల్సీ కవిత అలా చెప్పింది.. ఎంపీ చామల షాకింగ్ కామెంట్స్

ABN, Publish Date - May 22 , 2025 | 07:59 PM

MP Chamala Kiran Kumar Reddy: మిస్ వరల్డ్ పోటీలను తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని .. కానీ ఆ పోటీలను చూసి కేటీఆర్ అసూయ పడుతున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. అందాల పోటీలు కేటీఆర్ ఊసు లేకుండా జరుగుతున్నాయని బాధపడుతున్నారని తెలిపారు.

MP Chamala Kiran Kumar Reddy

ఢిల్లీ: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత లెటర్‌పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) షాకింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో పదేళ్లు సరిగా పాలన చేయలేదని కవిత చెప్పిందని అన్నారు. ఇంటి గుట్టు బయటకు రాకుండా కేటీఆర్ తన బావ హరీష్‌రావు ఇంటికెళ్లారని తెలిపారు. కవిత ఒక్కరే ఈ లేఖ రాసినట్లుగా లేదని అన్నారు. సీనియర్స్ అందరూ కలసి లేఖ రాసినట్లుగా ఉందని చెప్పారు. కవిత లేఖతో బీఆర్ఎస్ వీక్ అయినట్లు తేలిపోయిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అన్న అనుమానం కవితకే ఉందని.. దీని మీద ప్రజలకు బీఆర్ఎస్ నిర్ణయం తెలపాలని కోరారు. కేటీఆర్‌కి పార్టీ పట్టాభిషేకం చేయడంతో కవిత, హరీష్‌రావులలో ఆందోళన కనిపిస్తోందని అన్నారు. కవితని జైలుపాలు చేసిన బీజేపీ గురించి కేసీఆర్ కేవలం ఒక్క నిమిషం కూడా మాట్లాడకపోవటంపై ఆమె ఆవేదన కనపడుతోందని అన్నారు. కవిత ఆత్మగౌరవం దెబ్బతిన్నట్లు కనిపిస్తోందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.


అలాగే మాజీమంత్రి కేటీఆర్‌పై (KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ అని, మాజీ సీఎం కేసీఆర్ అంత పెద్ద ఇంజనీర్ దేశంలో లేరని కేటీఆర్ అనడం చాలా విడ్డూరంగా ఉందని విమర్శించారు. భూగోళంలో ఇలాంటి ప్రాజెక్ట్ లేదని కేటీఆర్ గొప్పలు చెబుతున్నారని అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై నాగం జనార్ధన్ రెడ్డి వేసిన కేసులో ఇచ్చిన తీర్పును కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు కేటీఆర్ ముడిపెడుతున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగిందని సీబీఐ విచారణ చేయాలని నాగం జనార్ధన్ రెడ్డి గతంలో అడిగారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గుర్తుచేశారు. ఇప్పుడు నాగం జనార్దన్‌రెడ్డి బీఆర్ఎస్‌లోనే ఉన్నారని చెప్పుకొచ్చారు.


నిజాం నవాబు చార్మినార్ కడితే, కేసీఆర్ కాళేశ్వరం కట్టారని కేటీఆర్ చెబుతున్నారని అన్నారు. నాగం జనార్దన్ రెడ్డి కేసు ఎందుకు వేశారో ఆయన్ని అడిగితే తెలుస్తోందని చెప్పారు. కేసీఆర్‌కి మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చామని గుర్తుచేశారు. కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీ కట్టేందుకు తమ ప్రభుత్వం కొత్త అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. కేసీఆర్ బ్రహ్మాండగా పాలన చేశారని తెలంగాణ ప్రజలు చెప్పాలి కానీ బీఆర్ఎస్‌ నేతలే చెబితే ఎలా అని ప్రశ్నించారు. ప్రత్యేక విమానాలు వేసుకొని ఇతర దేశాలకు కూడా కేసీఆర్ వెళ్లారని గుర్తుచేశారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.


ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ చూస్తానని అంటే కేసీఆర్ ప్రభుత్వం చూడనివ్వలేదని..10 కిలోమీటర్ల వరకు పోలీసులను పెట్టారని గుర్తుచేశారు. కేటీఆర్ అపరిచితుడు సినిమాలో రెమోలాగా వ్యవహారిస్తున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సెటైర్లు గుప్పించారు. మిస్ వరల్డ్ పోటీలను తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని .. కానీ ఆ పోటీలను చూసి కేటీఆర్ అసూయ పడుతున్నారని విమర్శించారు. అందాల పోటీలు కేటీఆర్ ఊసు లేకుండా జరుగుతున్నాయని బాధపడుతున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి

SIT Notice Prabhakar: ప్రభాకర్ రావుకు ఇంటికి పోలీసులు.. ఎందుకంటే

Kishan Reddy Vs KTR: కేటీఆర్‌పై కిషన్‌రెడ్డి సీరియస్

ఇందిరా మహిళా శక్తి బజార్‌కు సుందరీమణులు

గుల్జార్ హౌస్ ప్రమాదానికి అసలు కారణం ఇదే

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 22 , 2025 | 10:11 PM