Home » Telugu News
పంచాయతీ సంగ్రామం ప్రశాంతంగా ముగిసింది. గత నెల 25న ఎన్నికల షెడ్యూల్ జారీతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో మూడు దశల్లో జరిగిన ఎన్నికలు 22 రోజులపాటు గ్రామాల్లో సందడి నింపింది. జిల్లాలో బుధవారం జరిగిన చివరి విడత పంచాయతీ ఎన్నికలు కూడా ఎలాంటి సంఘటనలకు తావు లేకుండా ప్రశాంతంగా ముగిసిపోవడంతో జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.
జీవీఎంసీ పరిధిలోని కొన్ని జోన్ల నుంచి చెత్తను కాపులుప్పాడలోని డంపింగ్ యార్డుకు తరలించే కాంట్రాక్టు సంస్థ ‘రాసా’పై అధికారులు అంతులేని ప్రేమ కనబరుస్తున్నారు. ఆ సంస్థ సక్రమంగా పనులు చేయడం లేదని ఇటీవల గుర్తించిన కమిషనర్ కేతన్గార్గ్ రూ.58 లక్షలు రికవరీ చేయాలని ఆదేశించారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం దూరవిద్య కోర్సులకు సంబంధించి నిర్వహిస్తున్న పరీక్షలు ప్రహసనంగా మారాయి. గత నెలలో జరిగిన పరీక్షల్లో కొన్నిచోట్ల యథేచ్ఛగా మాస్ కాపీయింగ్ జరిగినట్టు అధికారులు గుర్తించినా, ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
పుట్టుకతోనే వినికిడి సమస్య కలిగిన చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపే కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్ర చికిత్సలను విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(విమ్స్)లో కూడా నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు ఈ శస్త్ర చికిత్సలను ఈఎన్టీ, గాయత్రీ ఆస్పత్రుల్లో మాత్రమే చేసేవారు. అయితే, గడిచిన నాలుగేళ్లుగా ఈ విమ్స్లోనూ నిర్వహిస్తున్నారు. అయితే, ప్రజలకు సమచారం లేకపోవడంతో ఇక్కడ అందుతున్న సేవలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు.
మార్గశిర మాసం ఆఖరు గురువారం వన్టౌన్లోని కనకమహాలక్ష్మి ఆలయంలో అమ్మవారి దర్శనాలకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. నవంబరు 21న మొదలైన మార్గశిర మాసం ఈ నెల 19 (శుక్రవారం)తో ముగియనుంది. మార్గశిర మాసంలో అమ్మవారికి ప్రతి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
నగరంలో కాలుష్య నివారణకు పటిష్ఠ చర్యలు చేపడుతున్నామని, ఇందుకు తగిన ప్రమాణాలు పాటిస్తున్నామని కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ పేర్కొన్నారు. అమరావతిలో సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన సదస్సులో భాగంగా తొలిరోజు బుధవారం కలెక్టర్ జిల్లాకు సంబంధించి పలు అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులు మాట్లాడుతూ గత సమావేశానికి, ఇప్పటికీ నగరంలో కాలుష్యం పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయని పేర్కొనడంతో కలెక్టర్ స్పందించారు.
పశ్చిమ బైపాస్ సర్వీసు రోడ్ల ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. ప్యాకేజీ-3లో చిన అవుటపల్లి నుంచి గొల్లపూడి వరకు సర్వీసు రోడ్లను మంజూరు చేయాల్సిందిగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వశాఖ (మోర్త్)ను బుధవారం ఢిల్లీలో కోరారు. బైపాస్ దాదాపుగా పూర్తి కావడంతో సర్వీసు రోడ్ల పనులను అదనంగా చేపట్టడానికి మోర్త్ కూడా సానుకూలంగా స్పందించింది.
గృహ నిర్మాణశాఖలో అవినీతి వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నా చేతివాటం ప్రదర్శించడం మాత్రం ఆగడంలేదు. తాజాగా పెడన మండలంలో 36 మంది లబ్ధిదారుల సిమెంట్, ఇనుము పక్కదారి పట్టించారు. సుమారు 12 లక్షలపైనే నొక్కేసిన ఈ వ్యవహారంలో పూర్వ ఏఈ హస్తం ఉన్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. వీటిని అడ్డుకోవాల్సిన జిల్లా స్థాయి అధికారులు పట్టనట్టు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రేషన్ దుకాణాలను తీసివేయాలన్న ప్రయత్నాన్ని విరమించుకోవాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సివిల్ సప్లయీస్ హమా లి కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంటి బాలరాజు అన్నారు.
గ్రామపంచాయతీ ఎన్నికల్లో తుది విడతలో ఓటర్లు అదే హుషారు తో ఓటు హక్కు వినియోగించుకున్నారు.