Share News

జాతీయ ఐక్యతకు వారధిగా హిందీ

ABN , Publish Date - Feb 21 , 2026 | 03:48 AM

జాతీయ ఐక్యతకు బలమైన వారధిగా హిందీ నిలిచిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు. ఏ భాషకూ హిందీ ప్రత్యామ్నాయం కాదని తెలిపారు..

జాతీయ ఐక్యతకు వారధిగా హిందీ

  • భిన్నత్వంలో ఏకత్వాన్ని సాకారం చేసింది: సంజయ్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): జాతీయ ఐక్యతకు బలమైన వారధిగా హిందీ నిలిచిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు. ఏ భాషకూ హిందీ ప్రత్యామ్నాయం కాదని తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వం అనే భారతీయ భావనను సాకారం చేేస శక్తివంతమైన సాధనంగా హిందీ మారిందని చెప్పారు. త్రిపుర రాష్ట్రం అగర్తలలోని ఇంటర్నేషనల్‌ ఇండోర్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో నిర్వహించిన ‘‘పూర్వ ఈశాన్య, ఉత్తర ప్రాంతాల సంయుక్త ప్రాంతీయ రాజభాషా సదస్సు’’లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, సహాయ మంత్రి బండి సంజయ్‌, త్రిపుర సీఎం మాణిక్‌ సాహా, ఎంపీలు రాజీవ్‌ భట్టాచార్య, విప్లవ్‌ కుమార్‌ దేవ్‌, మహారాణి క్రుతి సింగ్‌ దేవ్‌ బర్మన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడారు. రాజ భాష హిందీ ఎప్పుడూ దేశంలోని అన్ని ప్రాంతాలను ఒక్కటిగా కలిపే పని చేసిందన్నారు. కాగా, ఢిల్లీలో నిర్వహిస్తున్న ఏఐ సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి ప్రధాని మోదీని ప్రశంసించారని.. అయితే, వేదిక బయట కాంగ్రెస్‌ కార్యకర్తలు కేంద్రానికి వ్యతిరేకంగా అర్ధగ్న ప్రదర్శన చేయడం విడ్డూరమని సంజయ్‌ ధ్వజమెత్తారు. దేశ ప్రతిష్ఠకు సంబంధించిన సదస్సు సందర్భంగా కాంగ్రెస్‌ ద్వంద్వ వైఖరి బట్టయలైందని విమర్శించారు.

Updated Date - Feb 21 , 2026 | 03:48 AM