‘పిల్’ ఉపసంహరణకు రూ.3 కోట్లు డిమాండ్
ABN , Publish Date - Feb 21 , 2026 | 03:52 AM
భూమి క్రమబద్ధీకరణ విషయమై ఆసక్తికరమైన కేసు హైకోర్టు ముందుకు వచ్చింది. భూమి క్రమబద్ధీకరణను సవాలు చేస్తూ ప్రజాప్రయోజన...
హైకోర్టులో కేకే కుమారుడి వాదన
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): భూమి క్రమబద్ధీకరణ విషయమై ఆసక్తికరమైన కేసు హైకోర్టు ముందుకు వచ్చింది. భూమి క్రమబద్ధీకరణను సవాలు చేస్తూ ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు కాగా, దాన్ని ఉపసంహరించుకోవాలంటే రూ.3కోట్లు ఇవ్వాలని పిటిషనర్ డిమాండు చేస్తున్నారన్నది ఈ కేసు సారాంశం. సిద్ధిపేట జిల్లా కొండపాకకు చెందిన గడీల రఘువీర్‌రెడ్డి తనను ఈ విధంగా బెదిరిస్తున్నట్టు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కే కేశవరావు కుమారుడు కే వెంకటేశ్వర్‌రావు హైకోర్టుకు నివేదించారు. ఆయా పిటిషన్లపై శుక్రవారం జస్టిస్ జే శ్రీనివాసరావు ధర్మాసనం విచారణ చేపట్టింది. తప్పుడు పిటిషన్లతో న్యాయప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.