అభివృద్ధిని అడ్డుకోవడమే కాంగ్రెస్ లక్ష్యం
ABN , Publish Date - Feb 21 , 2026 | 03:51 AM
దేశ అభివృద్ధికి కాంగ్రెస్ వ్యతిరేకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శించారు. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా-ఏఐ ఇంపాక్ట్.....
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): దేశ అభివృద్ధికి కాంగ్రెస్ వ్యతిరేకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శించారు. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా-ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు గందరగోళం సృష్టించడం అభివృద్ధిని అడ్డుకోవడమేనని మండిపడ్డారు. గందరగోళం సృష్టించడం ద్వారా ఆ పార్టీ మనస్తత్వం మరోసారి బయటపడిందని అన్నారు. ‘ప్రతిష్ఠాత్మక గ్లోబల్ సమ్మిట్‌లో జాతీయ ఐక్యత వ్యక్తం కావాలి. కానీ, కాంగ్రెస్ కార్యకర్తలు తమ వైఖరితో దేశ ప్రతిష్ఠకు భంగం కలిగించారు. అంతర్జాతీయ వేదికపై దేశ ప్రతిభను ప్రతిబింబించాల్సిన సమయంలో ఇలాంటి చర్యలు సరికాదు’’ అని ఎక్స్ వేదికగా రాంచందర్‌రావు మండిపడ్డారు.