Share News

టాప్‌ 500 బిట్‌శాట్‌ ర్యాంకర్లకు ట్యూషన్‌ ఫీజు మాఫీ

ABN , Publish Date - Feb 21 , 2026 | 04:01 AM

ప్రతిభకు ఆర్థిక అడ్డంకులు ఉండకూడదనే సంకల్పంతో బిట్స్‌ పిలానీ కీలక నిర్ణయం తీసుకుంది. 2026- 27 విద్యా సంవత్సరం నుంచి బిట్‌శాట్‌లో....

టాప్‌ 500 బిట్‌శాట్‌ ర్యాంకర్లకు ట్యూషన్‌ ఫీజు మాఫీ

  • బిట్స్‌ పిలానీ చరిత్రాత్మక నిర్ణయం

బిట్స్‌ పిలానీ, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): ప్రతిభకు ఆర్థిక అడ్డంకులు ఉండకూడదనే సంకల్పంతో బిట్స్‌ పిలానీ కీలక నిర్ణయం తీసుకుంది. 2026- 27 విద్యా సంవత్సరం నుంచి బిట్‌శాట్‌లో టాప్‌ 500 ర్యాంకులు సాధించిన విద్యార్థులకు పూర్తి ట్యూషన్‌ ఫీజును మాఫీ చేయనున్నట్లు ప్రకటించింది. కుటుంబ వార్షిక ఆదాయం రూ.20 లక్షల వరకు ఉన్న అర్హులైన విద్యార్థులకు నాలుగేళ్లపాటు పూర్తి ట్యూషన్‌ ఫీజును సంస్థ భరిస్తుంది. అయితే, సంబంధిత క్యాంప్‌సలో కనీసం 7.5 సీజీపీఏ కొనసాగించడం తప్పనిసరి. అడ్మిషన్‌ ఆఫర్‌లోనే ఇది హామీగా ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది. దీంతో ప్రతిభావంతులు ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా బిట్స్‌ను ఎంపిక చేసుకునే అవకాశం కలుగుతుంది.

Updated Date - Feb 21 , 2026 | 04:01 AM