Home » LATEST NEWS
జగన్ ఆదేశాల మేరకే వైసీపీ శ్రేణులు పులివెందులలో అరాచకం సృష్టిస్తున్నాయని టీడీపీ నేతలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఏదో రకంగా ఎన్నికలను ఆపాలనే దురుద్దేశంతోనే వైసీపీ ఇంతలా బరితెగిస్తోందని మండిపడుతున్నారు.
దసరా సెలవుల నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో సిటీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. మరోవైపు ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను కేటాయించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
రాయచోటి, రాజంపేటలలో స్థానిక సంస్థల నామినేషన్ల వేళ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాయచోటిలో అలజడి సృష్టించేందుకు వచ్చిన అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
కడప జిల్లాలోని పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. నామినేషన్ కేంద్రం దగ్గర కూటమి, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగింది.
పల్నాడు జిల్లా దాచేపల్లిలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. దాచేపల్లి నామినేషన్ కేంద్రం వద్ద వైఎస్సార్సీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగాయి.
ఉమ్మడి కడప జిల్లాలోని రాయచోటి, కడప నామినేషన్ కేంద్రాల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గాంధీనగర్ స్కూల్ నామినేషన్ సెంటర్ వద్ద వైసీపీ.. టీడీపీ శ్రేణుల మధ్య పరస్పర ఘర్షణలు చెలరేగాయి.
టాలీవుడ్, కోలీవుడ్తో పాటు క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి రేపుతున్న వార్త ఇది! సన్రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్యా మారన్, ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ వివాహ వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అధికారికంగా ఆహ్వానం అందింది. సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్, ఆయన భార్య కావేరి మారన్..
పట్టణ స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల చేశారు. 7 కార్పొరేషన్లు, 29 మున్సిపాలిటీలకు మేయర్లు, ఛైర్పర్సన్ల స్థానాలకు అభ్యర్థులను శుక్రవారం రాత్రి ప్రకటించారు.
గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఏపీ హైకోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. విజయవాడకు చెందిన సాయికృష్ణ కస్టోడియల్ మృతి కేసుకు సంబంధించి పిటిషనర్కు(సాయికృష్ణ తల్లి) రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించడంతో పాటు ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ధర్మాసనం తీర్పునిచ్చింది.
రాజధాని అమరావతి అభివృద్ధి పనులు నిధుల కొరత లేకుండా ముందుకుసాగే మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. అమరావతి నిర్మాణం, అభివృద్ధి పట్ల సంతృప్తిగా ఉన్న ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులు అదనపు నిధులు సమకూర్చడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయి.
ఎన్నికల్లో ఓటమి ఖాయమనే భయంతోనే రాష్ట్రంలో వైసీపీ నేతలు అల్లర్లు సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర కుమార్ విమర్శించారు.
రిలయన్స్ జియో పెట్టుబడులు, భవిష్యత్ కార్యాచరణపై ఇషా అంబానీ కీలక వ్యాఖ్యలు చేశారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పట్టువస్త్రాలు సమర్పించారు. సతీసమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
చిత్తూరు జిల్లాలోని పుంగనూరులో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదటి రోజు రక్తసిక్తంగా మారింది. ఈ ప్రాంతంలో అధికార కూటమి, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు చెలరేగాయి.
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై టీడీపీ హైకమాండ్ హైటెక్ వ్యూహానికి తెరలేపింది. ఎమ్మెల్యేలు, పరిశీలకుల సిఫారసులతో పాటు నేరుగా ప్రజలు, క్యాడర్ నాడి పట్టేందుకు ఐవీఆర్ఎస్ (IVRS) సర్వేను అస్త్రంగా మలుచుకుంది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆరో రోజు మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీదేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు.