టీ-20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన హోం మంత్రి అనిత

ABN, Publish Date - Feb 20 , 2026 | 12:06 PM

ప్రజా భద్రత కోసం పోలీసులు అనునిత్యం.. 24 గంటలు విధులు నిర్వహిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. శుక్రవారం మంగళగిరిలోని ఏపీఎస్పీ‌ ఆరో బెటాలియన్ ప్రాంగణంలో రెండో ఆల్ ఇండియా పోలీస్ సౌత్ జోన్ టీ-20 క్రికెట్ టోర్నమెంట్ ఆమె ప్రారంభించారు.

టీ-20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన హోం మంత్రి అనిత 1/9

ప్రజా భద్రత కోసం పోలీసులు అనునిత్యం.. 24 గంటలు విధులు నిర్వహిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు.

టీ-20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన హోం మంత్రి అనిత 2/9

శుక్రవారం మంగళగిరిలోని ఏపీఎస్పీ‌ ఆరో బెటాలియన్ ప్రాంగణంలో రెండో ఆల్ ఇండియా పోలీస్ సౌత్ జోన్ టీ-20 క్రికెట్ టోర్నమెంట్ ఆమె ప్రారంభించారు.

టీ-20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన హోం మంత్రి అనిత 3/9

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ.. ఇలాంటి క్రీడా కార్యక్రమాలు పోలీసుల్లో ఐక్యతను పెంపొందించడమే కాకుండా.. శారీరక-మానసిక ఉల్లాసాన్ని సైతం అందిస్తాయని చెప్పారు.

టీ-20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన హోం మంత్రి అనిత 4/9

క్రీడల్లో పాల్గొనడం ముఖ్యమని.. గెలుపు మాత్రమే లక్ష్యం కాదని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు.

టీ-20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన హోం మంత్రి అనిత 5/9

అమరావతి ప్రజల రాజధాని అని.. దీనిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు.

టీ-20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన హోం మంత్రి అనిత 6/9

క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఇలాంటి టోర్నమెంట్లు ఎంతో దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం హోం మంత్రి అనితను పోలీస్ ఉన్నతాధికారులు ఘనంగా సత్కరించారు.

టీ-20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన హోం మంత్రి అనిత 7/9

వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పోలీసు జట్లు ఈ టోర్నమెంట్‌లో పాల్గొన్నాయి. సుమారు ఆరు రాష్ట్రాల నుంచి మొత్తం 10 జట్లు పోటీ పడుతున్నాయి.

టీ-20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన హోం మంత్రి అనిత 8/9

ఈ ప్రారంభ కార్యక్రమంలో హోం మంత్రి అనిత.. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం టీ 20 టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ క్రికెట్ మ్యాచ్‌లు ఐదు రోజుల పాటు మూలపాడు గ్రౌండ్‌లో జరగనున్నాయి.

టీ-20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన హోం మంత్రి అనిత 9/9

ఈ కార్యక్రమంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఐజీపీ స్పోర్ట్స్ కె.వి. మోహన్ రావు, డీఐజీ వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్ కేకేఎన్ అన్బురాజన్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Updated at - Feb 20 , 2026 | 12:58 PM