Home » ABN
గోదావరి పుష్కరాలపై అధికారులతో రాజమండ్రి బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి చర్చించారు. ఈ నేపథ్యంలో శాఖాపరమైన విధానాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. గోదావరి పుష్కరాలపై వెంటనే అంచనాలు రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు.
తిరుపతి పరకామణి చోరీ కేసులో కీలక వ్యక్తి ఆర్మ్డ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. అయితే ఆయన మృతిపై సోదరుడు శ్రీహరి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
సీఐఐ భాగస్వామ్య సదస్సు శుక్రవారం విశాఖపట్నం వేదికగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా పలు విదేశీ కంపెనీలతో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అందుకు సంబంధించిన వివరాలను సీఎం చంద్రబాబు నాయుడు.. తన ఎక్స్ ఖాతా వేదికగా వివరించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైనా.. ఈ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీకి 38 శాతం ఓట్లు పోల్ అయ్యాయని చెప్పారు. గత తమ ప్రభుత్వంలో ప్రతి ఉప ఎన్నికల్లో తమ పార్టీనే గెలిచిందని అన్నారు.
పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఆరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాసరెడ్డి కేసును స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శుక్రవారం విచారించారు. అలాగే ఈ విచారణ శనివారం సైతం కొనసాగనుంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటర్లు విలక్షణమైన తీర్పు ఇచ్చారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఎన్ని ఓటములు వచ్చినా .. కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్య మనుగడ సాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
బిహార్లో స్వాతహాగా బీజేపీ 92 స్థానాల్లో గెలిచిందన్నారు. ఇక బిహార్లో కాంగ్రెస్ పార్టీ ఉప ప్రాంతీయ పార్టీగా మారిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పని అయిపోయిందని.. ఇక ఆయన పబ్జి ఆడుకోవాలంటూ వ్యంగ్యంగా పేర్కొన్నారు.
భారీ మెజార్టీతో తనను జూబ్లీహిల్స్ ప్రజలు గెలిపించారని నవీన్ యాదవ్ పేర్కొన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలుపించినందుకు ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు పాదాభివందనం చేస్తున్నట్లు ప్రకటించారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతోపాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు.
బిహార్ ఎన్నికల్లో ప్రజలు సరైన తీర్పును ఇవ్వబోతున్నారని.. ఎన్డీయే కూటమి విజయం ఖాయమని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. ఇక రాబోయే ఎన్నికల్లో బెంగాల్లోనూ అధికారం చేపట్టబోతున్నామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.