Share News

అసెంబ్లీలో జరిగే చర్చలు ఎలా ఉన్నాయ్.. విద్యార్థులతో అయ్యన్న మాటామంతి

ABN , Publish Date - Feb 18 , 2026 | 05:57 PM

అసెంబ్లీ సమావేశాలు వీక్షించడానికి విద్యార్థులు ఇవాళ(బుధవారం) వచ్చారు. ఈ క్రమంలో అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు విద్యార్థులతో మాటామంతి నిర్వహించారు.

అసెంబ్లీలో జరిగే చర్చలు ఎలా ఉన్నాయ్.. విద్యార్థులతో అయ్యన్న మాటామంతి
Ayyanna Patrudu

అమరావతి, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ సమావేశాలు వీక్షించడానికి విద్యార్థులు ఇవాళ(బుధవారం) వచ్చారు. ఈ క్రమంలో అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు (Ayyanna Patrudu) విద్యార్థులతో మాటామంతి నిర్వహించారు. అసెంబ్లీలో జరిగే చర్చలు ఎలా ఉన్నాయని విద్యార్థులను ప్రశ్నించారు. చర్చలు బాగా జరుగుతున్నాయని విద్యార్థులు చెప్పారు. సీఎం చంద్రబాబును చూడాలని ఉందని చెప్పారు విద్యార్థులు.


రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖపట్నం రావడంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అక్కడికి వెళ్లారని చెప్పారు అధికారులు. అసెంబ్లీ సమావేశాలు చూసిన పలువురు విద్యార్థులు తమకు పోలవరం ప్రాజెక్టు కూడా చూడాలని ఉందన్నారు. ఈసారి నుంచి విద్యార్థులకు పోలవరం ప్రాజెక్టుని కూడా సందర్శించే అవకాశం కల్పిస్తామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాటిచ్చారు. తమకు అసెంబ్లీ సమావేశాలు నేరుగా చూడటం కొత్త అనుభూతి కలిగిందని విద్యార్థులు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధం: హోంమంత్రి అనిత

మంత్రి నారా లోకేశ్‌పై ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశంసలు..

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 18 , 2026 | 06:01 PM