Home » AP Govt
కేంద్ర స్కిల్ డెవలప్ మెంట్ శాఖ మంత్రి జయంత్ చౌదరితో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ న్యూఢిల్లీలో సోమవారం సమావేశం అయ్యారు. విశాఖపట్నంలో జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ (నేషనల్ స్కిల్స్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్) ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా జయంత్ చౌదరిని విజ్ఞప్తి చేశారు.
ఆధునాతనంగా మోడల్ పోలీస్‌స్టేషన్‌ల నిర్మాణం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. ఏపీ పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ తరపున అనేక మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు.
ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్ సీటు వెనుక భాగంలో ‘ఫస్ట్ ఎయిడ్ బాక్స్’ అనేది ఒకటి ఉంటుంది. ప్రయాణం సందర్భంగా బస్సులో ఏదైనా ప్రమాదం జరిగితే.. ప్రథమ చికిత్స అందించడానికి అవసరమైన మందులు ఆ బాక్సులో అందుబాటులో ఉంచాలి.
వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు డమ్మీలు అనటం అంబటికి మంచి పద్ధతి కాదని హితవు పలికారు.
ఏపీ వ్యాప్తంగా మారుమూల గ్రామాలకు సైతం నీళ్లు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతోందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత వ్యాఖ్యానించారు. చెరువులు జలకళను సంతరించుకోవడంతో గ్రామస్తులు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.
ప్రత్యక్ష పన్నుల కంటే పరోక్ష పన్నుల ద్వారానే ప్రభుత్వాలకు అధిక ఆదాయం వస్తోందని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తెలిపారు. ఈ భారం సామాన్య ప్రజలపై పడుతోందని పేర్కొన్నారు.
కొడాలి నానిపై మంత్రి సుభాష్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. పులులు, సింహాలు అంటూ ఇప్పుడు గ్రామ సింహాలుగా మారిపోయారంటూ ఎద్దేవా చేశారు.
చింతూరు టూ మారేడుమిల్లి ఘాట్ రోడ్డు ప్రయాణంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. రాత్రి వేళ ఘాట్ రోడ్డుపై ప్రయాణం చేయకుండా ఆంక్షల ఉత్తర్వులు జారీ చేశారు చింతూరు ఐటీడీఏపీవో శుభం నోక్‌వాల్.
ఆకాంక్షిత జిల్లాల్లో దేశంలోనే ప్రథమ స్థానం సాధించింది కడప జిల్లా. వినూత్న పథకాలు, ఇతర అభివృద్ధి పథకాలు వ్యూహాత్మక ప్రణాళిక చేసి జాతీయస్థాయిలో మొదటి స్థానం సాధించారు కలెక్టర్ చెరుకూర శ్రీధర్.
విశాఖకు 5 లక్షల ఐటీ ఉద్యోగాలు వచ్చేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి నారా లోకేష్ అన్నారు. కాగ్నిజెంట్‌లో పనిచేసే ఉద్యోగులంతా విశాఖ బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని సూచించారు.