Share News

అమరావతి అభివృద్ధికి మరో అడుగు.. కొత్త సంస్థలకు భూములు కేటాయించిన ప్రభుత్వం

ABN , Publish Date - Feb 19 , 2026 | 04:23 PM

మంత్రి నారాయణ నేతృత్వంలో సీఆర్డీఏ పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై ఇవాళ (గురువారం) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.

అమరావతి అభివృద్ధికి మరో అడుగు.. కొత్త సంస్థలకు భూములు కేటాయించిన ప్రభుత్వం
AP Minister Narayana

అమరావతి, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): ఏపీ మంత్రి నారాయణ (AP Minister Narayana) నేతృత్వంలో సీఆర్డీఏ పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై ఇవాళ (గురువారం) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా భూ సమస్యల పరిశీలన, రాజధానిలో పలు సంస్థలకు భూ కేటాయింపులు, కొత్తగా వచ్చే సంస్థలకు భూ కేటాయింపులు, ప్రపంచ స్థాయి సంస్థలను అమరావతికి తీసుకురావడం తదితర అంశాలపై చర్చించారు.


ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు. అమరావతిలో కొత్తగా 7 సంస్థలకు భూ కేటాయింపులు చేశామని స్పష్టం చేశారు. 11 సంస్థలకు గతంలో చేసిన కేటాయింపుల్లో మార్పులు చేశామని పేర్కొన్నారు. బ్యాంక్ ఉద్యోగుల నివాసాల కోసం భూ కేటాయింపులు చేశామని చెప్పుకొచ్చారు. రెయిన్ బో చిల్డ్రన్ హాస్పిటల్‌కు రెండు ఎకరాలు కేటాయించామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఈ సమావేశానికి మంత్రులు కొల్లు రవీంద్ర, కందుల దుర్గేశ్, గుమ్మిడి సంధ్యారాణి హాజరయ్యారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏసీబీ కోర్టు నోటీసులు..

నకిలీ మద్యం కేసు.. నిందితులకు రిమాండ్ పొడిగింపు

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 19 , 2026 | 05:15 PM