Home » AP News
వాజ్పేయి జయంతిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. అమరావతిలో వాజ్పేయ్ తొలి విగ్రహాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చిన చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.
మెరుగు పెడతామంటూ.. గ్రామాల్లో తిరుగుతూ బంగారం గొలుసు ఎత్తుకెళ్లిన సంఘటన అనంతపురం జిల్లా ఉరవకొండలో చోటుచేసుకుంది. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు గ్రామంలోకి వచ్చి ఇత్తడి సామాన్లకు మెరుగు పెడతామని చెబుతూ మోసాలకు పాల్పడ్డారు. వివరాలిలా ఉన్నాయి.
శబరిమలకు వెళ్లి వస్తూ మార్గమధ్యలో నదిలో స్నానానికి దిగి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీరు మృతిచెందిన విషాద సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. నందకుమార్ (27) అనే యువకుడు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. అయితే.. బరిమలకు వెళ్లి వస్తూ నదిలో మునిగి చనిపోయాడు. వివరాలిలా ఉన్నాయి.
వాజ్పేయి జయంతి సందర్భంగా ఇవాళ సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఈ క్రమంలో అటల్ - మోదీ సుపరిపాలన యాత్ర ముగింపు సభ గురువారం వెంకటపాలెం వద్ద నిర్వహించారు.
అనంతపురం జిల్లాలో వైసీసీ కార్యకర్తల అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. మాజీ ముఖ్యమంత్రతి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకల సందర్బంగా రప్పా.. రప్పా.. అంటూ ఆ పార్టీ కార్యకర్తలు చేసిన భీభత్సాన్ని పోలీస్ శాఖ సీరియస్గా తీసుకుంది.
అంతర్జాతీయ సైబర్ క్రైమ్ నెట్వర్క్ను ఏపీ సీఐడీ పోలీసులు చేధించారు. కంబోడియా నుంచి సైబర్ క్రైమ్ నేరాలకు పాల్పడిన నిందితుడిని గుర్తించి 1400 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. డైరక్టరేట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సహకారంతో భారీ క్రైమ్ నెట్వర్క్ను చేధించారు ఏపీ సీఐడీ అధికారులు.
పద్మశ్రీ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ అరుదైన ఘనత సాధించింది. గుంటూరులో ప్రతి గురువారం ఉదయం 8:30 గంటలకు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న విషయం తెలిసిందే.
క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ క్రైస్తవుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని పేర్కొన్నారు.
కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఇవాళ జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్, అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు వెంటనే కోరుకోవాలని ఆకాంక్షించారు. వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గురువారం కలిశారు. ఈ సందర్భంగా సీఎంతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు.