పీఎస్ఎల్వీ-సీ62 వైఫల్యంపై విశ్లేషణ కమిటీ
ABN , Publish Date - Feb 21 , 2026 | 06:42 AM
పీఎస్ఎల్వీ-సీ 62 రాకెట్ ప్రయోగ విఫలంపై కేంద్ర ప్రభుత్వం విశ్లేషణ కమిటీని నియమించింది.
కె.విజయరాఘవన్ అధ్యక్షతన కేంద్రం ఏర్పాటు
సూళ్లూరుపేట, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): పీఎస్ఎల్వీ-సీ 62 రాకెట్ ప్రయోగ విఫలంపై కేంద్ర ప్రభుత్వం విశ్లేషణ కమిటీని నియమించింది. ఈ ఏడాది జనవరి 12న శ్రీహరికోటలోని షార్ నుంచి ప్రయోగించిన ఈ రాకెట్ సాలిడ్ మోటారులో సాంకేతిక లోపం తలెత్తి ప్రయోగం విఫలమైన విషయం తెలిసిందే. గత ఏడాది మే 18న పీఎ్‌సఎల్వీ-సీ61 ప్రయోగం కూడా మూడో దశలో సాంకేతిక సమస్యతో విఫలమైంది. దీన్ని కేంద్రం సీరియ్‌సగా తీసుకున్నట్లు సమాచారం. పీఎం మాజీ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కె.విజయరాఘవన్ అధ్యక్షతన మాజీ ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ సహాధ్యక్షుడిగా విశ్లేషణ కమిటీని నియమించింది. దీంతో షార్ సెంటర్‌తో పాటు తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ సెంటర్‌కు వెళ్లి ప్రయోగ వైఫల్యానికి కారణాలను సభ్యులు పరిశీలించారు.