బౌద్ధ సర్క్యూట్ అభివృద్ధి చేస్తాం: కందుల దుర్గేశ్
ABN , Publish Date - Feb 21 , 2026 | 06:23 AM
కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో బౌద్ధ క్షేత్రాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో బౌద్ధ క్షేత్రాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. అమరావతి, నాగార్జునకొండ, ఘంటసాల, ఆదుర్రు, తొట్లకొండ, బావికొండ, చిత్రకోట తదితర ప్రాంతాలను కలుపుతూ బౌద్ధ సర్క్యూట్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. శుక్రవారం ప్రశ్నోత్తరాల్లో ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, ఆర్‌వీఎ్‌సకేకే రంగారావు (బేబీ నాయన) అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానాలిచ్చారు.