మినరల్స్‌లో ఏపీని కీలకంగా మారుస్తాం: కొల్లు
ABN , Publish Date - Feb 21 , 2026 | 06:20 AM
‘కేంద్రం క్రిటికల్ మినరల్ పార్కుల ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: ‘కేంద్రం క్రిటికల్ మినరల్ పార్కుల ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్రంలో ఉన్న అపార ఖనిజ వనరుల తవ్వకాలతోపాటు వాటిని ప్రాసెస్ చేసే వేల్యూయాడెడ్ (విలువ జోడింపు) పరిశ్రమలను ఏర్పాటు చేయడం (ఇంటిగ్రేటెడ్ వేల్యూచైన్) ద్వారా రేర్ ఎర్త్ మినరల్స్ తయారీలో ఏపీని కీలకంగా మారుస్తాం’ అని రాష్ట్ర గనులు, భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకరరావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు.