Home » Minister Narayana
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెత్త పన్ను తీసేశామని మంత్రి నారాయణ ప్రకటించారు. అమృత్ పథకానికి వైసీపీ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడంతో పథకం కింద ఇచ్చే నిధులు ఉపయోగించలేకపోయామని మంత్రి నారాయణ తెలిపారు.
తల్లిదండ్రులు కూడా పిల్లలపై శ్రద్ధ పెడితే, ఉన్నత స్థాయికి చేరతారనిమంత్రి నారాయణ అన్నారు. ‘నేను 1972లో పదో తరగతిలో ఫెయిల్ అయ్యాను. నాలో కసి పెరిగి డిగ్రీ, పీజీలో కళాశాల ఫస్ట్ క్లాస్ స్టూడెంట్గా తయారు అయ్యాను’’ అని మంత్రి నారాయణ గుర్తుచేసుకున్నారు.
జగన్ ప్రభుత్వంలో ఐదేళ్లు ప్రైవేట్ ఆస్తులు కొల్లగొట్టారు, ప్రభుత్వ ఖజానా లూటీ చేశారని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. వైసీపీ హయాంలో రీసర్వే పేరిట భూములు కొట్టేశారని ఆరోపించారు. రీసర్వే పేరుతో ఊరికో భూబకాసురుడిని తయారుచేశారని ధ్వజమెత్తారు.
ఏపీ టెక్స్టైల్ అపరల్ అండ్ గార్మెంట్స్ పాలసీ 2024-29కి క్యాబినెట్లో ఆమోదం తెలిపిందని మంత్రి కొలుసు పార్ధసారధి అన్నారు. ఏపీ మారిటైమ్ పాలసీకి క్యాబినెట్లో ఆమోదించినట్లు చెప్పారు. మూడు తాగునీటి ప్రాజెక్టులు ఆలస్యం అవ్వడం వల్ల జీవో 62 ద్వారా ప్రైజ్ ఎడ్జెస్ట్ మెంట్ చేయబోతున్నామన్నారు. ఉద్దానం తాగునీటి వసతి, వైసీపీలో పులివెందుల, కర్నూలులో డోన్ నియోజకవర్గాలకు పదిన్నర లక్షల మందికి తాగునీటి సమస్య తీర్చడానికి నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కొలుసు పార్ధసారధి పేర్కొన్నారు.
ప్రజలని ఇబ్బంది పెట్టడం ప్రభుత్వ ఉద్దేశం కాదని.. అభివృద్ది కోసమే పన్నుల వసూలు అని మంత్రి నారాయణ తెలిపారు. ఏపీ వ్యాప్తంగా పన్నుల చెల్లింపు విధానం ఒకేలా ఉంటుంది. నెల్లూరుకి ప్రత్యేకమేమీ ఉండదని స్పష్టం చేశారు.
విజయవాడ అభివృద్దికి సంబంధించి అధికారులకు మంత్రి నారాయణ దిశానిర్ధేశం చేశారు. నగరంలో పూర్తి స్థాయిలో తాగునీటి సరఫరా జరిగేలా ట్యాంకుల నిర్మాణానికి ఆదేశాలు జారీ చేశారు.
Andhrapradesh: ఢిల్లీ మెట్రో అధికారులు విశాఖ, విజయవాడకు లైట్ మెట్రోను సిఫారస్సు చేశారని మంత్రి నారాయణ అన్నారు. గతంలో ఇచ్చిన టెండర్లను వైసీపీ ప్రభుత్వం 2019లో క్యాన్సిల్ చేసిందని అన్నారు. అప్పటి ప్రభుత్వానికి మెట్రో చేయాలనే ఉద్దేశమే లేదని విమర్శించారు. అయితే కేంద్రంతో మాట్లాడి కలకత్తా మోడల్లో మెట్రో ప్రాజెక్టును...
రబీ సీజన్లో 8లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని తీర్మానం చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. సోమశిల నుంచి 55.100 టీఎంసీల నీటిని 5.51లక్షల ఎకరాలకు, కండలేరు నుంచి 22.600 టీఎంసీలతో 2.26లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు.
Andhrapradesh: అమరావతి ల్యాండ్ పూలింగ్ అనుమానాలను నివృత్తి చేసేందుకు మంత్రి నారాయణ రంగంలోకి దిగారు. స్వయంగా రైతుల ఇళ్లకు వెళ్లి రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. విజయవాడలోని రాజధాని రైతు అనుమోల్ గాంధీ నివాసానికి మంత్రి వెళ్లారు. ఇప్పటికే రాజధాని గ్రామాల్లో పలువురు రైతుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పూలింగ్ అంగీకార పత్రాలను స్వీకరించారు.
'పీఎం స్వనిధి'' పథకం ద్వారా పేదలకు ఆర్థిక సాయం అందించి వారి అభివృద్దికి కృషి చేసినందుకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు అందజేసిందని మంత్రి నారాయణ తెలిపారు. ఈ పథకాన్ని సమర్థంగా వినియోగించుకుని పేదరికం నుంచి బయటపడిన లబ్ధిదారులను మంత్రి నారాయణ సన్మానించారు. పేదల ఆదాయం రెండింతలు చేయాలన్న సీఎం ఆదేశాలతో పథకాన్ని అమలు చేస్తున్నామని ఉద్ఘాటించారు.