Share News

Minister Narayana: నెల్లూరు ఓఆర్ఆర్‌పై మంత్రి నారాయణ క్లారిటీ..

ABN , Publish Date - Jan 11 , 2026 | 10:09 AM

ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించటమే ఎన్డీయే ప్రభుత్వ ప్రధాన అజెండా అని ఏపీ మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. అవుటర్ రింగ్ రోడ్డు వేయాలన్నది నుడా చైర్మన్ ఉద్దేశమని.. ఆయన ఆలోచన మంచిదేనని పేర్కొన్నారు..

Minister Narayana: నెల్లూరు ఓఆర్ఆర్‌పై మంత్రి నారాయణ క్లారిటీ..
Minister Narayana

నెల్లూరు, జనవరి11(ఆంధ్రజ్యోతి): నెల్లూరు అవుటర్ రింగ్ రోడ్డుపై (Nellore Outer Ring Road) ఏపీ మంత్రి నారాయణ (Minister Narayana) క్లారిటీ ఇచ్చారు. అవుటర్ రింగ్ రోడ్డు నిర్మించాలన్నది నుడా చైర్మన్ ఉద్దేశమని.. ఆయన ఆలోచన మంచిదేనని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నెల్లూరుకు అవుటర్ రింగ్ రోడ్డు అవసరం లేదని చెప్పుకొచ్చారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించటమే ఎన్డీయే ప్రభుత్వ ప్రధాన అజెండా అని వ్యాఖ్యానించారు. ఇవాళ ( ఆదివారం) నెల్లూరు జిల్లాలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు మంత్రి నారాయణ.


ట్రాఫిక్ ఇబ్బందులు ఉండేవి..

గతంలో ట్రంక్ రోడ్ మీదుగా హైవే వెళ్లేదని.. రోడ్డును రెండుగా డివైడ్ చేసేదని.. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఉండేవని తెలిపారు. మినీ బైపాస్ ఏర్పాటు చేసిన తర్వాత ట్రంక్ రోడ్‌లో ట్రాఫిక్ తగ్గిందని చెప్పుకొచ్చారు. నాలుగు లైన్ల బైపాస్‌ను ఆరులైన్లుగా చేస్తున్నారని వివరించారు. రూరల్, సిటీలో హైవేపై రెండు అండర్ పాసులు రాబోతున్నాయని వెల్లడించారు. అవుటర్ రింగ్ రోడ్డుకి రూ.2 వేల కోట్లకు పైగా నిధులు కావాలని సూచించారు. రోడ్ డిజైన్, భూ సమీకరణకు ఎక్కువ నిధులు కావాలని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక స్థితిలో అంత కేటాయించే పరిస్థితి లేదని తెలిపారు. తమ ప్రభుత్వ అజెండాలో ప్రస్తుతం అవుటర్ రింగ్ రోడ్డు లేదని ప్రస్తావించారు. జనాభా పెరిగి ఇబ్బందులు వస్తే ఓఆర్ఆర్ గురించి ఆలోచిస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మార్కాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం..

దుర్గగుడిలో అపచారం.. ఏం జరిగిందంటే..

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 11 , 2026 | 10:36 AM