నెల్లూరు జిల్లా ఏసీ నగర్‌లోని మల్లెల సంజీవయ్య ప్రభుత్వ హైస్కూల్‌ను నూతన హంగులతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా హైస్కూల్‌ను రూ.9.69 కోట్ల సీఎస్ఆర్ నిధులతో ఆధునికీకరించేందుకు జిగ్మా కంపెనీ ముందుకొచ్చింది.
గొడ్డలి ప్రభుత్వం మూసేసిన వీఆర్సీ ఆధునికీకరణలో విద్యా యజ్ఞం ప్రారంభించానని మంత్రి నారాయణ అన్నారు. అదే స్ఫూర్తితో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆర్‌ఎస్‌ఆర్ స్కూల్‌ను అద్భుతంగా తీర్చిదిద్దారని తెలిపారు.
మానసిక దివ్యాంగురాలిపై కన్నేసిన ఓ వ్యక్తి తాను స్వీపర్‌గా పనిచేస్తున్న చర్చిలోనే అమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మున్సిపల్ ఛైర్మన్, డాక్టర్ ప్రభాకర్ నాయుడు అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు.
నెల్లూరు జిల్లాలోని పొట్టేపాళెం వద్ద 50 ఏళ్లుగా ఉన్న వంతెన సమస్య ఎట్టకేలకు తీరింది. దాదాపు రూ.6.54కోట్లతో కలుజుపై వంతెనను కూటమి ప్రభుత్వం నిర్మించింది.
ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ భారత్ - స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ప్రజలందరి సహకారం అవసరమని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ అన్నారు. స్వచ్ఛాంధ్ర కింద అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన బాలుడు రామయ్య ఆచూకీ ఎట్టకేలకు లభించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో బాలుడిని సురక్షితంగా గుర్తించి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. ఈ విషయాన్ని ఏపీ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో బైక్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పల్లె పండుగ 3.0 కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గ్రామాల్లో అద్భుతమైన మార్పునకు నాంది పలుకుతున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కూటమికి ప్రజలు వేసిన ఓటు వృథా కాలేదన్నారు.
పల్లె పండుగ 3.0 ద్వారా గ్రామాల రూపురేఖలు మారతాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. జిల్లాలో పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి పవన్ ప్రారంభించారు.