Share News

సీఎం చంద్రబాబుపై దుర్భాషలు.. మాజీ మంత్రి కాకాణికి నోటీసులు..

ABN , Publish Date - Feb 03 , 2026 | 03:01 PM

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి పోలీసులు నోటీసులు అందజేశారు. సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కాకాణి చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసులు నమోదు అయ్యాయి.

సీఎం చంద్రబాబుపై దుర్భాషలు.. మాజీ మంత్రి కాకాణికి నోటీసులు..
Kakaniki Govardhan Reddy

నెల్లూరు, ఫిబ్రవరి 3: మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి (Former Minister Kakani Goverdhan Reddy) నివాసానికి పోలీసులు వెళ్లారు. ఆయనకు అధికారులు నోటీసులు అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో పరుష పదజాలంతో దుర్భాషలాడిన ఆరోపణలపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో నెల్లూరు రూరల్, పొదలకూరు, మనుబోలు పోలీస్ స్టేషన్లలో కాకాణిపై కేసులు నమోదయ్యాయి.


సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే సోమిరెడ్డి తల్లిదండ్రులపైనా కాకాణి దుర్భాషలాడారు. ఈ నేపథ్యంలో పోలీసులు మంగళవారం కాకాణి నివాసానికి వెళ్లి, ఆయనతో మాట్లాడిన అనంతరం నోటీసులు అందజేశారు. ఈ కేసుల్లో విచారణకు సహకరించాలని, అవసరమైన వివరాలు అందించాలని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటనతో నెల్లూరు జిల్లాలో రాజకీయం మరింత వేడెక్కింది.


నోటీసులపై కాకాణి...

పోలీసులు నోటీసులు ఇచ్చారని.. ఈరోజు(మంగళవారం) సాయంత్రమే విచారణకు రావాలని చెప్పారని మాజీ మంత్రి కాకాణి తెలిపారు. తాను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు గాను విచారణకు పిలిచినట్లు చెప్పుకొచ్చారు. అయితే, ఏ అంశంలో తాను ఆరోపణలు చేశానో స్పష్టంగా చెప్పాలని పోలీసులను అడిగినట్లు తెలిపారు. ఏ అంశంలో విచారణకి రమ్మంటున్నారో చెబితే, వాటికి సంబంధించిన ఆధారాలు తీసుకువెళతానన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో ఏ అంశం ఉందనేది స్పష్టత లేదన్నారు మాజీ మంత్రి. కేసుకు సంబంధించిన వివరాలు ఇస్తే, విచారణకు హాజరవుతానని కాకాణి గోవర్ధన్ స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

అలాంటి వారికి పోలీసు ట్రీట్మెంట్ ఖాయం.. మంత్రి అనిత వార్నింగ్

లండన్‌లో మంత్రి నారాయణ బృందం పర్యటన.. ఒలింపిక్ సైట్‌ల సందర్శన

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 03 , 2026 | 03:36 PM