Home » Andhra Pradesh
సాంకేతికత సాయంతో ప్రైవేట్ కొరియర్ సర్వీసులకు ధీటుగా పోస్టాఫీసులను తయారు చేస్తున్నామని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. విట్ వర్సిటీలో జెన్ జెడ్ పోస్టాఫీసును కేంద్రమంత్రి ప్రారంభించారు.
విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యకరమైన అలవాట్లు పెంపొందించేందుకు ఏపీ వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ముస్తాబు కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ పాఠశాలలో సీఎం చంద్రబాబు లాంఛనంగా ముస్తాబు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు.
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడిని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రంగా ఖండించారు. బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం హిందువుల మీద జరుగుతున్న దాడులు నరమేధాన్ని ఖండించని వారు అసలు భారతీయులేనా అని ప్రశ్నించారు.
కర్నూలు జిల్లా ప్రజలను చలి గజగజ వణికిస్తోంది. రోజు రోజుకూ చలి తీవ్రత ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
శ్రీశైలం దేవస్థానంలో అన్యమత ప్రార్థనలు, అసాంఘిక కార్యకలాపాలపై దేవస్థానం ఈవో ఆంక్షలు విధించారు. ఇలాంటివి చట్టరీత్యా నేరమని.. చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఏపీ వ్యాప్తంగా ముస్తాబు కార్యక్రమాన్ని అమలు చేయాలని ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ, ఎయిడెడ్ , ప్రైవేటు, గురుకులాలు, వసతి గృహాలు, కళాశాలల్లో తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించింది.
వాతావరణంలో మార్పులు, చలి తీవ్రతతో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. విష జ్వరాలు విజృంభిస్తుండడంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి.
యోగివేమన విశ్వవిద్యాలయం పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఎంఏ, ఎంకామ్, ఎంఎస్‌సీ) కోర్సుల్లో నేరుగా ప్రవేశాల ప్రక్రియ శనివారం (20వ తేదీ)తో ముగియనుందని విశ్వవిద్యాలయ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డాక్టర్ టి.లక్ష్మీప్రసాద్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
కోడుమూరు పట్టణంలో డీజిల్ దొంగలు పడ్డారు. గురువారం అర్థరాత్రి రోడ్డుపై ఉన్న పలు లారీల డీజిల్ ట్యాంకులను పగులగొట్టి దొంగలు డీజిల్ ఎత్తుకెళ్లారు. నంద్యాలకు చెందిన సత్యరాజ్ అనే డ్రైవర్ తన లారీలో మొక్కజొన్నను లోడ్ చేసుకొని ఆదోనికి వెళ్లారు.
కడప జిల్లాలోని పట్టణ ప్రాంతంలో ఉన్న స్వయం సహాయక సంఘాల సభ్యులు, కుటుంబ సభ్యులకు మెరుగైన జీవనోపాదులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందుకోసం మెగా జాబ్‌మేళాను శనివారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.