అనకాపల్లి జిల్లాలో భారీ చోరీ.. కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీసులు
ABN , Publish Date - Feb 20 , 2026 | 07:36 PM
అనకాపల్లి జిల్లాలోని మునగపాక మండలం ఘంటవానిపాలెంలో ఈ నెల 15వ తేదీన భారీ చోరీ జరిగింది. ఈ కేసును అనకాపల్లి జిల్లా పోలీసులు చాకచక్యంగా ఛేదించారు..
అనకాపల్లి జిల్లా, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లాలోని మునగపాక మండలం ఘంటవానిపాలెంలో ఈనెల 15వ తేదీన భారీ చోరీ జరిగింది. ఈ కేసును అనకాపల్లి జిల్లా పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఈ దర్యాప్తులో సుమారు రూ.30 లక్షల విలువైన 16.5 తులాల బంగారం స్వాధీనం చేసుకుని.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ తుహిన్ సిన్హా (Tuhin Sinha) వివరాలు వెల్లడించారు. వివిధ చోరీ కేసుల్లో భాగంగా అనకాపల్లి పట్టణానికి చెందిన కోన రాజేశ్ అనే వ్యక్తిని గుర్తించి, అరెస్ట్ చేశామని తెలిపారు. బాధితురాలు ఉమావతి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారని చెప్పారు. నిందితుడిని నాలుగు రోజుల వ్యవధిలోనే కొక్కిరాపల్లి జంక్షన్ వద్ద అరెస్ట్ చేసి, 16.5 తులాల బంగారం ఆభరణాలను రికవరీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసును వేగవంతంగా పూర్తి చేసిన పోలీస్ టీమ్‌ను ఎస్పీ తుహిన్ సిన్హా ప్రత్యేకంగా అభినందించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జాతిపిత ప్రజల్లోకి ఎందుకు రావట్లేదు.. కేసీఆర్‌పై కడియం శ్రీహరి సెటైర్లు
మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ..
Read Latest Telangana News And AP News And Telugu News