Home » Anakapalli
అనకాపల్లి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాంబిల్లి మండలం దిమిలి గ్రామంలోని శారదా నది బట్టి కాలువలో 19 ఏళ్ల యువతి మృతదేహం లభ్యమైంది.
రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అనకాపల్లి జిల్లాలోని తన స్వగ్రామమైన సబ్బవరంలో అగ్నిమాపక కేంద్ర నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ మేరకు అగ్ని మాపక సిబ్బంది సేవలను కొనియాడారు.
అనకాపల్లి జిల్లా నాతవరంలోని గొల్లవీధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. కరెంట్ షాకుకు గురై ఇద్దరు మహిళలు మృతిచెందారు.
అనకాపల్లి జిల్లాలోని సబ్బవరంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. జగన్ పార్టీకి పలువురు నేతలు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు.
నిరుద్యోగ యువత జీవితాలతో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆటలాడటం సమంజసం కాదని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల ఆశలపై జగన్ నీళ్లు చల్లుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడి పర్యటన దక్షిణాఫ్రికాలో కొనసాగుతోంది. ఏపీ వన్యప్రాణి, పర్యావరణ పరిరక్షణ కమిటీ ఛైర్మన్‌గా ఉన్న ఆయన.. దక్షిణాఫ్రికాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో వందకు వంద శాతం కూటమి పార్టీలు గెలవాలని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత దిశానిర్దేశం చేశారు.
ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ బ్లాక్ దగుడుపల్లి నుంచి 600 కిలోల గంజాయిని తుని తరలిస్తుండగా గురువారం ఉదయం అనకాపల్లి రూరల్ పోలీసులు సంపతిపురం జంక్షన్ వద్ద మాటువేసి వ్యాన్‌తో పాటు పైలట్ కారును పట్టుకున్నట్టు ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు.
ఏపీలో అన్ని నదులను అనుసంధానం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చి తెలుగుతల్లి రుణం తీర్చుకుంటామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేటలో పర్యటించారు. ఏరియల్ వ్యూ ద్వారా పోలవరం ఎడమ కాల్వను పరిశీలించి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను విడుదల చేశారు.