పర్యాటక రంగాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తాం: హోంమంత్రి అనిత
ABN , Publish Date - Jan 29 , 2026 | 11:56 AM
పర్యాటక రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర హోంమంత్రి అనిత వ్యాఖ్యానించారు. ఈనెల 30, 31 తేదీల్లో అనకాపల్లి ఉత్సవ్‌ను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు.
అనకాపల్లి జిల్లా, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పర్యాటక రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత(Vangalapudi Anita) వ్యాఖ్యానించారు. గురువారం అనకాపల్లి జిల్లాలో అనిత పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనకాపల్లి ఉత్సవ్ నేపథ్యంలో ముత్యాలమ్మపాలెం తీరంలో.. విద్యుత్ దీపాలు, బీచ్ స్పోర్ట్స్, వాటర్ స్పోర్ట్స్, లైవ్ బ్యాండ్, ఫుడ్ స్టాల్స్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా ఉన్నారు.
వైభవంగా అనకాపల్లి ఉత్సవ్..
అనకాపల్లి ఉత్సవ్‌ను ఈనెల 30, 31 తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయని హోం మంత్రి తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ల ఆధ్వర్యంలో ఏపీలో పర్యాటక శాఖ అభివృద్ధి చెందుతోందని చెప్పుకొచ్చారు. గతంలోనూ విశాఖపట్నం ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించామని ఆమె గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు.
కార్నివాల్ ఏర్పాటు..
స్థానిక కళాకారులకు ఈ ఉత్సవాల్లో అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని హోం మంత్రి తెలిపారు. ఈ మేరకు ముత్యాలమ్మపాలెం తీరంలో అనేక కార్యక్రమాలు జరగనున్నాయని తెలిపారు. కొండకర్లలోనూ వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేశామని వివరించారు. అనకాపల్లిలో ఫ్లవర్ షో, క్రాకర్స్ షో, సంగీత విభావరి సహా కార్నివాల్‌నూ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. గజ ఈతగాళ్లను కూడా తీరంలో సిద్ధంగా ఉంచుతున్నామన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏసీబీ మెరుపు సోదాలు.. వాటిపై అధికారుల ఫోకస్..
ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై సీఎం చర్చ
Read Latest AP News And Telugu News