Share News

సికింద్రాబాద్‌-విశాఖపట్నం మార్గంలో.. 4 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు అదనపు ఏసీ బోగీలు

ABN , Publish Date - Jan 22 , 2026 | 08:05 AM

సికింద్రాబాద్‌-విశాఖపట్నం మార్గంలో నడిచే 4 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు అదనపు ఏసీ బోగీలు ఏర్పాటు చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఈమేరకు ఈనెల 24వతేదీనుంచి నుంచి ఈ అదనపు ఏసీబోగీల ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.

సికింద్రాబాద్‌-విశాఖపట్నం మార్గంలో.. 4 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు అదనపు ఏసీ బోగీలు

హైదరాబాద్‌ సిటీ: సికింద్రాబాద్‌ - విశాఖపట్నం(Secunderabad - Visakhapatnam) మార్గంలో నాలుగు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ప్రస్తుతం ఉన్న బోగీలకు అదనంగా మరో మూడు అదనపు ఏసీ బోగీలు జతచేశారు. సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం మధ్య నడుస్తున్న (22203/22204) దురంతో ఎక్స్‌ప్రెస్‌, సికింద్రాబాద్‌-అనకాపల్లి(Secunderabad-Anakapalli) మధ్య నడుస్తున్న (07055/07056) ప్రత్యేకరైళ్లకు ప్రస్తుతం ఫస్ట్‌ఏసీ 1, సెకండ్‌ ఏసీ 4, థర్డ్‌ఏసీ 9బోగీల చొప్పున ఉండగా, అదనంగా 3థర్డ్‌ ఏసీ బోగీలను జతచేశారు. అనకాపల్లి స్పెషల్‌కు ఈ నెల 22నుంచి, విశాఖకు వెళ్లే దురంతోకు 24నుంచి ఈ అదనపు ఏసీబోగీల సదుపాయం అమల్లోకి వస్తుందని సీపీఆర్‌ఓ శ్రీధర్‌ తెలిపారు.


city3.2.jpg

ఈ వార్తలు కూడా చదవండి.

పెంపుడు కుక్కకు.. మేడారంలో తులాభారం! క్షమాపణలు చెప్పిన.. హీరోయిన్‌

పాలిచ్చే పశువులకు చికెన్‌, మటన్‌ వ్యర్థాలు!

Read Latest Telangana News and National News

city3.3.jpg

Updated Date - Jan 22 , 2026 | 08:05 AM