ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ప్రజలు బీజేపీ పార్టీపై విశ్వాసంతో ఉన్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ( PM Modi ) వ్యాఖ్యానించారు.
తెలంగాణ ఇచ్చామన్న నినాదంతో ప్రజల్లోకి వెళ్లిన కాంగ్రెస్ చేతిలో బీఆర్ఎస్ ఊహించని ఓటమి చవిచూసింది. 2014లో పార్టీగా ఆవిర్భవించిన తర్వాత ఎన్నికల్లో బీఆర్ఎస్ తొలిసారి ఓటమిని చవిచూసింది. తెరముందు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహించగా, తెరవెనుక వ్యూహరచన సాగించిన క్రెడిట్.. ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలుకు దక్కుతుంది.
రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత వసుంధరా రాజే భారీ విజయం సాధించారు. ఝల్రాపటన్ నుంచి తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి రామ్‌లాల్ చౌహాన్‌పై 53,193 ఓట్ల ఆధిక్యంతో ఆమె గెలుపొందారు. రాజస్థాన్‌లో బీజేపీ విజయానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విజన్, డవలప్మెంట్ కారణమని వసుంధరా రాజే అన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టడంపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ కట్టబెట్టడం ద్వారా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, బీఆర్ఎస్ నేత కేటీ రామారావుకు తగిన జవాబు చెప్పారని అన్నారు.
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మెజారిటీ మార్క్‌ను దాటినట్లు ట్రెండ్స్ వెలువడటంతో ముఖ్యమంత్రి ఎవరనే ఆసక్తికరమైన ప్రశ్న తెరపైకి వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ పేర్లు ఇప్పటికే ప్రచారంలో ఉండగా, తాజాగా ఆధ్యాత్మిక నేత, ఆల్వార్ ఎంపీ మహంత్ బాలక్‌నాథ్ పేరు కూడా వినిపిస్తోంది.
ప్రస్తుతం వెలువడుతున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఆధిక్యత కనబరుస్తోంది. తెలంగాణ మినహా మిగతా మూడు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది.
ఊహించిన విధంగానే మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ కంటే 90 సీట్లలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన జ్యోతిరాధిత్య సింధియా ప్రాంతమైన గ్వాలియర్-మాల్వా ప్రాంతంలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది.
మూడు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్‌లో బీజేపీ ముందంజ.. రాహుల్ గాంధీపై బీజేపీ నేత సీటీ రవి విమర్శలు..
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారం నిలబెట్టుకునే దిశగా ఫలితాలు వెలువడుతుంటడం, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో సైతం మెజారిటీ మార్క్ దాటడం, తెలంగాణలోనూ తొలిసారి రెండంకెల స్థాయికి చేరువతుండటంతో పార్టీలో సంబరాలు మొదలవుతున్నాయి. బీజేపీ ప్రధాన కార్యాలయంలో రాత్రి 7 గంటలకు జరిగే విజయోత్సవాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఈ నెల 6న ఇండియా కూటమి సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే.. డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్‌లకు సమావేశంలో పాల్గొనాలని కోరారు.