మాజీ బ్రాంచ్ మేనేజరే సూత్రధారి
ABN , Publish Date - Feb 26 , 2026 | 02:18 AM
చండీగఢ్‌లో ఉన్న ‘ఐడీఎఫ్‌సీ ఫస్ట్’ బ్యాంకు శాఖలో హరియాణా ప్రభుత్వ ఖాతాలకు సంబంధించి రూ.590కోట్ల మోసం వ్యవహారంలో సూత్రధారి ఆ శాఖలో...
‘ఐడీఎఫ్‌సీ ఫస్ట్’ బ్యాంకులో రూ.590కోట్ల మోసం కేసులో నలుగురి అరెస్టు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: చండీగఢ్‌లో ఉన్న ‘ఐడీఎఫ్‌సీ ఫస్ట్’ బ్యాంకు శాఖలో హరియాణా ప్రభుత్వ ఖాతాలకు సంబంధించి రూ.590కోట్ల మోసం వ్యవహారంలో సూత్రధారి ఆ శాఖలో అంతకుముందు బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేసిన రిభవ్ రిషి అని దర్యాప్తులో తేలింది. రిభవ్ అదే బ్యాంకులో రిలేషన్‌షి్‌ప మేనేజర్‌గా పనిచేసిన అభయ్‌తో కలిసి ఈ మోసానికి పాల్పడినట్లు వెల్లడైంది. ఆ డబ్బును రిభవ్ భార్య స్వాతి, బావమరిది అభిషేక్‌లకు చెందిన ‘స్వస్తిక్ దేశ్ ప్రాజెక్ట్స్’ అనే కంపెనీ ఖాతాకు తరలించినట్లు హరియాణా ఏసీబీ డైరెక్టర్ జనరల్ చావ్లా తెలిపారు. నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. రిభవ్, అభయ్ ఇద్దరూ బ్యాంకులో పనిచేస్తున్నప్పుడే ఈ మోసానికి పాల్పడ్డారు. 6నెలల క్రితం ఉద్యోగాలకు రాజీనామా చేశారు. అయితే, హరియాణా ప్రభుత్వం ఇటీవల తమ ఖాతాలను మూసివేయాలని, ఆ డబ్బును వేరే బ్యాంకు ఖాతాల్లోకి పంపించాలని కోరడంతో మోసం బయటపడింది.