అవినీతి పుట్టలో.. కోట్ల కట్టలు
ABN , Publish Date - Feb 26 , 2026 | 02:07 AM
ఆయన ఒడిశా మైనింగ్ డిపార్టుమెంట్‌లో డిప్యూటీ డైరెక్టర్. పేరు దేవబ్రత మొహంతి. ఓ లైసెన్సు ఉన్న బొగ్గు వ్యాపారి నుంచి రూ.30 వేలు ...
30 వేలు లంచం తీసుకుంటూ దొరికిన అధికారి ఇంట్లో రూ.4కోట్ల నగదు
భువనేశ్వర్, ఫిబ్రవరి 25: ఆయన ఒడిశా మైనింగ్ డిపార్టుమెంట్‌లో డిప్యూటీ డైరెక్టర్. పేరు దేవబ్రత మొహంతి. ఓ లైసెన్సు ఉన్న బొగ్గు వ్యాపారి నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఉన్నప్పుడు విజిలెన్స్ అధికారులకు మంగళవారం దొరికారు. ఇదేదో చిన్న పామేలే అని మొదట్లో అనుకున్నారు. కానీ ఆయన ఇళ్లలో తనిఖీలు చేశాక తెలిసింది అదో పే....ద్ద అవినీతి అనకొండ అని. భువనేశ్వర్‌లోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించి అక్కడ ఉన్న ట్రాలీ బ్యాగ్‌ల్లో కూరి పెట్టిన నోట్లను లెక్కిస్తే రూ. 4 కోట్లుగా తేలింది. ఇది కాకుండా ఆయన ఆఫీస్ టేబుల్లో ఉన్న రూ. 1.20 లక్షలను కూడా సీజ్ చేశారు. అంతేగాక 130 గ్రాముల బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. మహంతిపై కేసు నమోదు చేసి బుధవారం అరెస్టు చేశారు.