విద్యార్థి జుట్టు కత్తిరించిన టీచర్.. తల్లిదండ్రుల ఆగ్రహం
ABN , Publish Date - Feb 26 , 2026 | 08:23 AM
కర్ణాటక రాష్ట్రం సింధనూరు తాలూకాలోని హోలీ ఫ్యామిలీ స్కూల్‌లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థి జట్టు కత్తిరించిన టీచర్‌పై తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: పాఠశాల అంటే క్రమశిక్షణ నేర్పే దేవాలయం. కానీ, అదే క్రమశిక్షణ పేరుతో ఒక టీచర్ ప్రవర్తించిన తీరు ఇప్పుడు వివాదాస్పదమైంది. విద్యార్థి జుట్టు పొడవుగా ఉందన్న నెపంతో, అందరి ముందు కత్తెరతో జుట్టు కత్తిరించి ఆ బాలుడిని అవమానించిన ఘటన కర్ణాటకలోని సింధనూరు తాలూకాలో వెలుగుచూసింది. ఈ చర్యపై విద్యార్థి తల్లిదండ్రుల, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సింధనూరు (Sindhanur) తాలూకాలోని హోలీఫ్యామిలీ స్కూల్ (Holy Family School)లో 5వ తరగతి చదువుతున్న తహిర్ అనే విద్యార్థి కటింగ్ చేయించుకోకుండా స్కూల్‌కి రావడంపై డ్రిల్ టీచర్ (Drill teacher) ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కటింగ్ చేయించుకోవాలని చెప్పారు. కానీ, ఆ విద్యార్థి అలాగే స్కూల్‌కి రావడంతో కత్తెర తీసుకొని విద్యార్థుల ముందే జుట్టు కత్తిరించారు టీచర్. స్కూల్ నుంచి ఇంటికి వెళ్లిన బాలుడు, జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. తన తోటి విద్యార్థుల ముందు టీచర్ అవమానించారని కన్నీరు పెట్టుకున్నాడు. టీచర్ చేసిన పనికి తల్లిదండ్రులు, బంధువులు స్కాల్ పాలనాధికారి (ఫాదర్)కి ఫిర్యాదు చేశారు. ఏదైనా విషయం ఉంటే తమకు చెప్పాలని లేదా విద్యాశాఖ అధికారులకు తెలపాలని నిలదీశారు. అయితే, ఫాదర్ మాత్రం టీచర్ చేసిన పనిని సమర్థించారు. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు టౌన్ పోలీసులను ఆశ్రయించారు.
ఈ వార్తలు కూడా చదవండి
జ్ఞాన దంతాలు తొలగిస్తే చూపు తగ్గుతుందా? నిపుణులు ఏమంటున్నారంటే.?