కృత్రిమ మేధకు భయపడం..
ABN , Publish Date - Feb 26 , 2026 | 06:13 AM
కృత్రిమ మేధ(ఏఐ) సాంకేతికతతో మా ఉద్యోగాలు పోతాయని భయపడట్లేదని దేశీయ ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసె్‌స(టీసీఎస్) సీఈఓ, ఎండీ కే కృతివాసన్ అన్నారు. కంపెనీ ఆదాయాన్ని తగ్గించే...
పనిలో ఏఐని ఉపయోగించుకోవాలని మా సిబ్బంది అందరికీ సూచించాం..
టీసీఎస్ సీఈఓ, ఎండీ కే కృతివాసన్
ముంబై: కృత్రిమ మేధ(ఏఐ) సాంకేతికతతో మా ఉద్యోగాలు పోతాయని భయపడట్లేదని దేశీయ ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసె్‌స(టీసీఎస్) సీఈఓ, ఎండీ కే కృతివాసన్ అన్నారు. కంపెనీ ఆదాయాన్ని తగ్గించే రిస్క్ ఉన్నప్పటికీ.. కస్టమర్లకు వేగం గా, చౌకగా సేవలందించేందుకు ఏఐ సాధనాలను ఉపయోగించుకోవాలని తమ సిబ్బందిని కోరుతున్నట్లు ఆయన చెప్పారు. ఏఐ ఆధారిత పరిష్కారాలు అందించే విషయంలో సీనియర్ స్థాయి సిబ్బందితో పోలిస్తే యువ సిబ్బంది నైపుణ్యం కనబరుస్తున్నారని అన్నారు. నాస్కామ్ టెక్నాలజీ అండ్ లీడర్‌షిప్ ఫోరమ్(ఎన్‌టీఎల్‌ఎ్‌ఫ) వార్షిక సదస్సులో బుధవారం కృతివాసన్ మాట్లాడుతూ.. ‘‘ఏఐలో నైపుణ్యం కలిగి ఉండాలని మా 6 లక్షలకు పైగా సిబ్బందికి నొక్కి చెబుతున్నాం’’ అన్నారు. ఏఐ టెక్నాలజీ భవిష్యత్‌లో మరిన్ని అవకాశాలను పంచనుందని నమ్ముతున్నామని ఆయన పేర్కొన్నారు. మార్పును నిరోధించడానికి బదులు దాని ప్రయోజనాలను అందిపుచ్చుకోవాలన్నారు. ఏఐని నాగరిక మార్పుగా అభివర్ణించిన కృతివాసన్.. అది జ్ఞానాన్ని ప్రజాస్వామ్యం చేస్తోందని, 60 ఏళ్లుగా పరిష్కృతం కాని సమస్యలను పరిష్కరిస్తోందని చెప్పారు.
ఏఐని విసృతంగా ఉపయోగిస్తున్నాం:
ఐటీసీ చైర్మన్ సంజీవ్ పురి
ఇన్వెస్టర్ల అతిస్పందన కారణంగానే గడిచిన కొన్ని రోజుల్లో ఐటీ రంగ కంపెనీల షేర్ల ధరలు భారీగా క్షీణించాయని ఎఫ్‌ఎంసీజీ, ఐటీ సహా పలు రంగాల్లో వ్యాపారాలు సాగిస్తున్న ఐటీసీ చైర్మన్, ఎండీ సంజీవ్ పురి అన్నారు. సాంకేతికత ఎల్లప్పుడూ ఉత్తేజితమైన పాత్ర పోషించిందని, తమ వ్యాపారాల్లో ఉత్పాదకత, సామర్థ్యాలను పెంచడం కోసం ఏఐని విస్తృతంగా వినియోగించుకుంటున్నామని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి..
మీ కళ్లు చురుకైనవి అయితే.. ఈ ఫొటోలో HOT పదాన్ని 5 సెకెన్లలో కనుగొనండి..
ప్రియురాలి పెళ్లికి వచ్చిన ప్రియుడు.. అందరూ చూస్తుండగా ఏం చేశాడంటే.