Share News

ప్రియురాలి పెళ్లికి వచ్చిన ప్రియుడు.. అందరూ చూస్తుండగా ఏం చేశాడంటే..

ABN , Publish Date - Feb 25 , 2026 | 02:47 PM

బీహార్‌లోని బక్సర్‌లో మంగళవారం రాత్రి జరిగిన వివాహ వేడుకలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆ పెళ్లికి వచ్చిన వధువు ప్రియుడు ఘోరానికి పాల్పడ్డాడు. అందరూ చూస్తుండగానే వధువుపై కాల్పులు జరిపాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ప్రియురాలి పెళ్లికి వచ్చిన ప్రియుడు.. అందరూ చూస్తుండగా ఏం చేశాడంటే..
Bihar wedding tragedy

బీహార్‌లోని బక్సర్‌లో మంగళవారం రాత్రి జరిగిన వివాహ వేడుకలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆ పెళ్లికి వచ్చిన వధువు ప్రియుడు ఘోరానికి పాల్పడ్డాడు. అందరూ చూస్తుండగానే వధువుపై కాల్పులు జరిపాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బక్సర్‌కు చెందిన పద్దెనిమిదేళ్ల ఆర్తి కుమారి‌కి మంగళవారం వివాహం జరుగుతోంది. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఆర్తి తనకు కాబోయే భర్తతో వేదికపై ఉంది. ఆ జంట చుట్టూ స్నేహితులు, కుటుంబ సభ్యులు ఉన్నారు (Bihar wedding tragedy).


వధువు ఆర్తి సోదరి, నవదంపతులకు సిందూరం పెడుతున్న సమయంలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. వేదిక ముందు గుమిగూడిన అతిథులలో ఒక వ్యక్తి ఆర్తిపై కాల్పులు జరిపాడు. బుల్లెట్ ఆర్తి కడుపులోకి దూసుకెళ్లింది. వెంటనే ఆమె కుప్పకూలిపోయింది. దీంతో వివాహ వేదిక వద్ద గందరగోళం నెలకొంది. మండపంలో కాల్పులు జరుగుతున్నాయనుకుని చాలా మంది కల్యాణ మండపం నుంచి బయటకు పరుగులు తీశారు (Bride shot during wedding).


రక్తపు మడుగులో పడి ఉన్న ఆర్తిని సమీపంలోని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు (Gunfire at wedding stage). అక్కడ ప్రాథమిక చికత్స అనంతరం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతానికి ఆమె పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని సమాచారం. నిందితుడిని అదే గ్రామానికి చెందిన దీనబంధుగా గుర్తించారు. ఆర్తి, దీనబంధు మధ్య గతంలో ప్రేమ వ్యవహారం సాగిందని తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు అతని తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

దేవుడు క్షమించడు!

రైలు ప్రయాణికులకు రివార్డులు!

Updated Date - Feb 25 , 2026 | 03:21 PM