Share News

రైలు ప్రయాణికులకు రివార్డులు!

ABN , Publish Date - Feb 25 , 2026 | 02:14 AM

రైళ్లలో తరచూ ప్రయాణించే వారికోసం దక్షిణ మధ్య రైల్వే వినూత్న లాయల్టీ ప్రోగ్రామ్‌ను త్వరలో ప్రారంభించనుంది. ప్రయాణికులకు రివార్డ్స్‌ అందించడమే...

రైలు ప్రయాణికులకు రివార్డులు!

  • త్వరలో అందుబాటులోకి ‘రైల్‌మైల్స్‌’ లాయల్టీ ప్రోగ్రామ్‌

  • రివార్డు పాయింట్లతో ప్రయాణికులకు ప్రయోజనం

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): రైళ్లలో తరచూ ప్రయాణించే వారికోసం దక్షిణ మధ్య రైల్వే వినూత్న లాయల్టీ ప్రోగ్రామ్‌ను త్వరలో ప్రారంభించనుంది. ప్రయాణికులకు రివార్డ్స్‌ అందించడమే ఈ ప్రోగ్రామ్‌ ప్రధాన ఉద్దేశమని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ రివార్డు పాయింట్లను పలు రకాలుగా వినియోగించుకునే అవకాశం కల్పించనున్నారు. దేశంలోనే తొలిసారిగా దక్షిణ మధ్య రైల్వే ‘రైల్‌మైల్స్‌’ అనే జాతీయ లాయల్టీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించబోతోంది. ముందు హైదరాబాద్‌ డివిజన్‌లో దీన్ని ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా తరచుగా ప్రయాణించే వారిని ప్రోత్సహించి, పర్యావరణ అనుకూల ప్రయాణాన్ని పెంచవచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రయాణ దూరం, క్లాస్‌, ఎలక్ట్రిఫికేషన్‌ లైన్స్‌.. తదితరాంశాల ఆధారంగా ప్రయాణికులు ‘గ్రీన్‌ మైల్స్‌’ రివార్డులను పొందుతారు. సరుకు రవాణాదారులకు టన్‌/కిలోమీటర్ల ఆధారంగా ఇవి లభిస్తాయి. ఈ రివార్డులను రైళ్లలో క్లాస్‌ అప్‌గ్రెడేషన్‌లు, ప్రీమియం లాంజ్‌లు, రిటైరింగ్‌ రూమ్‌ల బుకింగ్‌ ఆఫర్ల కోసం వాడుకునే అవకాశం ఉంటుంది.

Updated Date - Feb 25 , 2026 | 02:14 AM