Share News

అండర్‌వేర్‌, హెయిర్‌ ఆయిల్‌ రెడీగా పెట్టండి

ABN , Publish Date - Feb 26 , 2026 | 02:16 AM

రాజు వెడలె రవితేజము లలరగ’’ అని పాడుకుంటూ మురిసిపోయారో..! లేదంటే చిటికేస్తే కింద అధికారులు వణుకుతూ చెప్పిన పనినల్లా చేస్తారని భావించారో కానీ...

అండర్‌వేర్‌, హెయిర్‌ ఆయిల్‌ రెడీగా పెట్టండి

  • నా ట్రిప్‌ కోసం 50 మందిని కేటాయించండి

  • ప్రయాగ్‌రాజ్‌ పర్యటన కోసం కింది అధికారులకు బీఎస్ఎన్‌ఎల్‌ డైరెక్టర్‌ కోర్కెల చిట్టా

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: ‘‘రాజు వెడలె రవితేజము లలరగ’’ అని పాడుకుంటూ మురిసిపోయారో..! లేదంటే చిటికేస్తే కింద అధికారులు వణుకుతూ చెప్పిన పనినల్లా చేస్తారని భావించారో కానీ, తన పర్యటన కోసం బీఎ్‌సఎన్‌ఎల్‌ డైరెక్టర్‌ (సీఎఫ్‌ఏ) వివేక్‌ బంజల్‌ కింది అధికారులకు ఇచ్చిన ఆదేశాలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఈనెల 25, 26 తేదీల్లో తన ప్రయాగ్‌రాజ్‌ పర్యటన కోసం సిద్ధం చేయాల్సిన ఓ భారీ జాబితాను కింది అధికారులకు బంజల్‌ పంపారు. అందులో ఆయన.. తన స్నానం కోసం కావాల్సిన సామగ్రితో పాటు ఆలయాల సందర్శన సమయంలో చేయాల్సిన ఏర్పాట్ల వరకు 21 పనుల కోసం 50 మంది అధికారులు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. తాను దిగే హోటల్‌ వద్ద డ్రైఫ్రూట్‌ బౌల్‌, ఫ్రూట్‌ బౌల్‌, షేవింగ్‌ కిట్‌, టవల్‌, టూత్‌పే్‌స్ట, బ్రష్‌, సబ్బు, షాంపూ, దువ్వెన, ఆయిల్‌ వంటివి సిద్ధం చేయాలన్నారు. సంగమం వద్ద స్నానానికి సిద్ధం చేయాల్సిన కిట్‌లో టవల్‌, అండర్‌గార్మెంట్లు, కొత్త చెప్పులు, దువ్వెన, అద్దం, ఆయిల్‌ బాటిల్‌, ఘాట్‌ వద్ద కూర్చోడానికి కొత్త దుప్పటి కావాలన్నారు. ఈ ఆదేశాల చిట్టా వైరల్‌ అయ్యి ఆయన తీరు విమర్శల పాలు కావడంతో చివరకు బంజల్‌ పర్యటన రద్దు చేసుకున్నారు. బంజల్‌ వ్యవహారం తెలిసి కేంద్ర సమాచార శాఖమంత్రి సింధియా వివేక్‌పై చర్యలకు ఆదేశించారు. 7రోజుల్లో సమాధానం చెప్పాలని ఉన్నతాధికారులు ఆయనకు షోకాజ్‌ నోటీసు జారీ చేశారు.

Updated Date - Feb 26 , 2026 | 02:16 AM