Share News

ట్రేడ్‌ డీల్‌ గురించి అడిగితే.. ఇజ్రాయెల్‌కు జారుకున్నారు: రాహుల్‌

ABN , Publish Date - Feb 26 , 2026 | 02:10 AM

ప్రధాని ఇజ్రాయెల్‌ పర్యటనపై కాంగ్రెస్‌ విమర్శలు గుప్పించింది. భారత్‌- అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాన్ని రద్దుచేసుకొనే ధైర్యం ఉందా అని తాను సవాల్‌ చేసి..

ట్రేడ్‌ డీల్‌ గురించి అడిగితే.. ఇజ్రాయెల్‌కు జారుకున్నారు: రాహుల్‌

ప్రధాని ఇజ్రాయెల్‌ పర్యటనపై కాంగ్రెస్‌ విమర్శలు గుప్పించింది. భారత్‌- అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాన్ని రద్దుచేసుకొనే ధైర్యం ఉందా అని తాను సవాల్‌ చేసి 24 గంటలైనా స్పందించని ప్రధాని మోదీ.. సైలెంటుగా ఇజ్రాయెల్‌కు జారుకున్నారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎద్దేవా చేశారు. ఇజ్రాయెల్‌లో డ్యాన్స్‌ చేశారని, పాటలు పాడారని ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో చెప్పినట్లుగా కాకుండా.. ఈసారైనా దేశ వ్యతిరేక పనులు చేయకుండా తిరిగి వస్తారా? అని ప్రశ్నించారు. నెతన్యాహును ప్రపంచమంతా విమర్శిస్తుంటే.. మోదీ ఆయనను ప్రియమైన మిత్రుడు అని సంబోధించటం సిగ్గుచేటు అని జైరాం రమేశ్‌ అన్నారు.

Updated Date - Feb 26 , 2026 | 02:10 AM