Share News

ప్రధాని మోదీ ఎన్నికను రద్దు చేయాలి

ABN , Publish Date - Feb 26 , 2026 | 02:05 AM

గత లోక్‌సభ ఎన్నికల్లో వారాణ సి నుంచి పోటీ చేసి గెలిచిన ప్రధాని మోదీ నామినేషన్‌ను తక్షణమే తిరస్కరించి ఆయన ఎన్నికను రద్దు చేయాలని యుగతులసి పార్టీ అధ్యక్షుడు...

ప్రధాని మోదీ ఎన్నికను రద్దు చేయాలి

  • రాష్ట్రపతి, ఈసీలకు టీటీడీ మాజీ సభ్యుడి ఫిర్యాదు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): గత లోక్‌సభ ఎన్నికల్లో వారాణ సి నుంచి పోటీ చేసి గెలిచిన ప్రధాని మోదీ నామినేషన్‌ను తక్షణమే తిరస్కరించి ఆయన ఎన్నికను రద్దు చేయాలని యుగతులసి పార్టీ అధ్యక్షుడు, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శివకుమార్‌ కొలిశెట్టి డిమాండ్‌ చేశారు. బుధవారం ఈ మేరకు రాష్ట్రపతికి, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండ నియోజకవర్గ అభ్యర్థి నాగ పుల్లారావు ఈడ అఫిడవిట్‌లో పార్ట్‌ బి, కాలమ్‌-8లోని కాలమ్స్‌ని ఖాళీగా వదిలేశారన్న కారణంతో ఆయన నామినేషన్‌ను ఎన్నికల సంఘం తిరస్కరించిందని గుర్తు చేశారు. ప్రధాని మోదీ అఫిడవిట్‌లో కూడా అదే పార్ట్‌ బి, కాలమ్‌ 8లోని పలు కాలమ్స్‌ ఖాళీగా ఉన్నప్పటికీ ఆయన నామినేషన్‌ను ఆమోదించిందని చెప్పారు. మోదీ విషయంలో ఎన్నికల సంఘం పక్షపాతం చూపి నిబంధనలను ఉల్లంఘించిందన్నారు.

Updated Date - Feb 26 , 2026 | 02:05 AM