Share News

మోదీకి ‘స్పీకర్‌ ఆఫ్‌ ద కెనెసెట్‌ మెడల్‌’

ABN , Publish Date - Feb 26 , 2026 | 02:12 AM

ప్రధాని నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్‌ పార్లమెంటు అత్యున్నత ‘స్పీకర్‌ ఆఫ్‌ ద కెనెసెట్‌ మెడల్‌’ను బహూకరించింది. భారత్‌-ఇజ్రాయెల్‌ల మధ్య వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసేందుకు అసాధారణ రీతిలో కృషి చేసినందుకు ...

మోదీకి ‘స్పీకర్‌ ఆఫ్‌ ద కెనెసెట్‌ మెడల్‌’

జెరూసలేం, ఫిబ్రవరి 25: ప్రధాని నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్‌ పార్లమెంటు అత్యున్నత ‘స్పీకర్‌ ఆఫ్‌ ద కెనెసెట్‌ మెడల్‌’ను బహూకరించింది. భారత్‌-ఇజ్రాయెల్‌ల మధ్య వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసేందుకు అసాధారణ రీతిలో కృషి చేసినందుకు దీనిని అందజేసింది. ఇజ్రాయెల్‌ పార్లమెంటు అయిన కెనెసెట్‌లో మోదీ ప్రసంగం పూర్తి కాగానే స్పీకర్‌ అమిర్‌ ఒహానా ఈ పురస్కారాన్ని బహూకరించారు. దీన్ని అందుకున్న తొలి నేత మోదీయే కావడం గమనార్హం. ఇజ్రాయెల్‌తో పాటు పాలస్తీనా నుంచి కూడా అత్యున్నత పతకాలు అందుకున్న అరుదైన ప్రపంచనేత మోదీయే కావడం విశేషం. ఆయన 2018లో పాలస్తీనా నుంచి ‘గ్రాండ్‌ కాలర్‌ ఆఫ్‌ ద స్టేట్‌ ఆఫ్‌ పాలస్తీనా’ పురస్కారాన్ని స్వీకరించారు.

Updated Date - Feb 26 , 2026 | 02:12 AM