Home » South Central Railway
పండగల సందర్భంగా ప్రయాణికుల డిమాండ్ మేరకు వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడుపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. అక్టోబరు 25న చర్లపల్లి- బరౌని (07093), 27న బరౌని- చర్లపల్లి (07094) ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు.
దీపావళి, చాట్ పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీని అధిగమించేందుకు ఈనెల17, 18 తేదీల్లో వేర్వేరు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలియజేశారు.
పండగలు వేళల్లో అయితే నెల ముందు నుంచి రిజర్వేషన్లు ఫుల్ అవుతాయి. ఈ క్రమంలోనే రైల్వే అధికారులు ప్రయాణిలకు కీలక సూచనలు చేస్తుంటారు. తాజాగా ఓ సౌత్ ఇండియ సెంట్రల్ రైల్వే..ప్రయాణికులకు కీలక సూచనలు జారీ చేసింది.
కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందేభారత్ (20703/04) ఎక్స్‌ప్రెస్‌కు మెయింటెనెన్స్ హాలీడే (ప్రస్తుతం అమల్లో ఉన్న) బుధవారమే ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది.
దక్షిణమధ్య రైల్వే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబరు మధ్య కాలంలో రూ.10,143 కోట్ల స్థూల ఆదాయాన్ని సాధించింది. 71.14 మిలియన్ టన్నుల సరుకు రవాణాతో రూ.6,635 కోట్ల ఆదాయం లభించగా, ప్రయాణికుల విభాగం నుంచి రూ.2,991 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది.
ప్రయాణికుల డిమాండ్ మేరకు వేర్వేరు ప్రాంతాల నుంచి 52 ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేశామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. అక్టోబరు 5 నుంచి 27 వరకు తిరుపతి-అనకాపల్లె-తిరుపతి మధ్య 8 ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.
దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో విద్యుద్దీకరణ పనులు వందశాతం పూర్తి చేశామని జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవ తెలిపారు. బుధవారం నిర్వహించిన జోనల్ రైల్వే వినియోగదారుల సంప్రదింపుల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
దక్షిణమధ్యరైల్వే పరిధిలో విజయవాడ మీదుగా వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్న పలు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లకు కొండపల్లి స్టేషన్‌లో హాల్ట్‌ను తాత్కాలికంగా ఎత్తివేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కొండపల్లి రైల్వేస్టేషన్‌లో ఫుట్‌ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం కానున్నందున హాల్ట్ తొలగింపు నిర్ణయం తీసుకున్నారు.
దసరా, దీపావళి, ఛత్ పండుగల రద్దీ దృష్ట్యా 170 ప్రత్యేక రైళ్లు నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది
ఆగ్నేయ రైల్వే చక్రధర్‌పూర్ డివిజన్ ఝార్సుగూడ గూడ్స్ యార్డ్ పునర్నిర్మాణానికి సంబంధించి నాన్-ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణమధ్యరైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.