Share News

Special trains: Special trains: హిందూపురం, అనంతపురం వాసులకు గుడ్ న్యూస్..

ABN , Publish Date - Jan 02 , 2026 | 06:49 AM

హిందూపూర్‌, ధర్మవరం, అనంతపూర్‌, గుంతకల్‌ వాసులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఎస్‌ఎంవీటీ బెంగళూరు-బీదర్‌ మధ్య నడుతున్న ప్రత్యేక రైలును పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది.

Special trains: Special trains: హిందూపురం, అనంతపురం వాసులకు గుడ్ న్యూస్..

- పత్యేక రైళ్లు పొడిగింపు

హైదరాబాద్‌: ప్రయాణికుల డిమాండ్‌ మేరకు ఎస్‌ఎంవీటీ బెంగళూరు-బీదర్‌(SMVT Bengaluru-Bidar) మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను(Special trains) ఫిబ్రవరి నెలాఖరు వరకు పొడిగించినట్టు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధికారులు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈనెల 2 నుంచి ఫిబ్రవరి 27వరకు (శుక్ర-ఆదివారం) ఎస్‌ఎంవీటీబెంగళూరు-బీదర్‌ (06539) మధ్య 17 ట్రిప్పులు, ఈనెల 3 నుంచి ఫిబ్రవరి 28 వరకు (శని-సోమవారం) బీదర్‌-ఎస్ఎంవీటీ బెంగళూరు(06540) మధ్య 17 ట్రిప్పులు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు పేర్కొన్నారు.


city1.2.jpg

ఈ రైళ్లు వచ్చి వెళ్లేప్పుడు యెల్హంక, హిందూపూర్‌, ధర్మవరం, అనంతపూర్‌, గుంతకల్‌(Hindupur, Dharmavaram, Anantapur, Guntakal), ఆదోని, మంత్రాలయం రోడ్‌, రాయచూర్‌, కృష్ణా, యాద్గిర్‌, వాడి, షాహబాద్‌, కలబురిగి, హమ్నాబాద్‌ స్టేషన్‌ల వద్ద ఆగుతాయని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.


city1.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

గాలి జనార్దన్‌రెడ్డిపై హత్యాయత్నం

మరో 3.5 కిలోల బంగారం రికవరీ

Read Latest Telangana News and National News

Updated Date - Jan 02 , 2026 | 06:53 AM