Home » Secunderabad
భారత ఆర్మీలో అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ (క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్), అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్ ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యాలయం అడ్మినిస్ట్రేటివ్ అధికారి, మేజర్ పీసీ రాయ్ ఒక ప్రకటనలో తెలిపారు.
అవ్వా .. ఎట్లున్నవ్.. బాగున్నావా.. అంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ అమ్మను ఆప్యాయంగా పలకరించారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. నగరంలోని ఓల్డుబోయినపల్లి డివిజన్లో కేటీఆర్ పర్యటించారు.
కింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధి పనుల నిమిత్తం మరో 9 రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు శనివారం దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.
ప్రతి ఒక్కరూ తొలుత మాతృభాషకు ప్రాధాన్యమివ్వాలని, దీంతోపాటు వీలైనన్ని ఎక్కువ భాషలను నేర్చుకోవాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు.
ప్రయాణికుల రద్దీ నేపధ్యంలో రేపు, ఎల్లుండి చర్లపల్లి-విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని దక్షిణ మధ్యరైల్వే ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించి రైలు సేవలను వినియోగించుకోవాలని ఆయన కోరారు.
సికింద్రాబాద్‌లో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణానికి ముందడుగు పడింది. నేషనల్ హైవే-44లోని మిలిటరీ డెయిరీఫాం వరకు 5.32 కిలోమీటర్ల మేర డబుల్‌డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించేందుకు హెచ్ఎండీఏ సిద్ధమైంది. రూ. 652 కోట్లతో పనులు చేపట్టేందుకు టెండర్లను ఆహ్వానించింది. దీంతో త్వరలోను నగరంలో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణం ప్రారంభం కానుంది.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడుస్తున్న 32 రైళ్లకు స్టాప్‌లను మరో ఆరునెలల పాటు కొనసాగించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. అలాగే.. హోలీ పండుగ నేపథ్యంలో పాట్నా-చర్లపల్లి మార్గంలో ప్రత్యేకరైళ్ల (44సర్వీసుల)ను నడపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. విశాఖపట్టణం వెళ్లేందుకు స్టేషన్ కు కుటుంబ సభ్యులుతో కలిసి స్టేషన్ కు వచ్చింది. ఈలోగా ఆమెకు పురిటి నొప్పులు అధికం కావడంతో అక్కడే ప్రసవించింది.
రైలు మార్గం ద్వారా ఇతర రాష్ట్రాలకు గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం రావడంతో ఎక్సైజ్ పోలీసులు బృందాలుగా ఏర్పడి బుధవారం విస్తృత తనిఖీలు చేశారు. భువనేశ్వర్ రైలులో 26.88 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ పోలీసులు వెల్లడించారు.
సికింద్రాబాద్(Secunderabad) నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భాగ్యనగర్ (సికింద్రాబాద్ నుంచి కాగజ్‌నగర్), దానాపూర్ (సికింద్రాబాద్ నుంచి బిహార్ ) ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు మరో రెండు రైళ్లు రద్దయ్యాయి.