Share News

Talasani Srinivas Yadav: రేవంత్‌పై వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా: తలసాని

ABN , Publish Date - Jan 13 , 2026 | 04:04 PM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ క్లారిటీ ఇచ్చారు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారంటే తనకు గౌరవం ఉందని తెలిపారు.

Talasani Srinivas Yadav: రేవంత్‌పై వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా: తలసాని
Talasani Srinivas Yadav

హైదరాబాద్, జనవరి 13: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని(CM Revanth Reddy) ఉద్దేశించి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Former Minister Talasani Srinivas Yadav) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీనిపై తలసాని స్పందిస్తూ.. సీఎం రేవంత్ రెడ్డిపై తాను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. మంగళవారం నాడు ఏబీఎన్ - ఆంధ్రజ్యోతితో తలసాని మాట్లాడుతూ.. ‘సికింద్రాబాద్‌ను ముక్కలు ముక్కలుగా చేస్తే ముక్కలుగా చేస్తా’ అనే మాటల్లో ఆవేశం తప్ప వేరే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారంటే తనకు గౌరవం ఉందని ఆయన తెలిపారు. తమ ప్రాంతాన్ని కాపాడుకోవడం తప్ప వేరే ఉద్దేశం లేదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలుసుకోవాలని సూచించారు.


కుట్రలు చేస్తే ఊరుకోం...

సికింద్రాబాద్‌ను ముట్టుకోవడం లేదని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారని.. కానీ సికింద్రాబాద్‌లోని పలు పోలీస్ స్టేషన్లు మల్కాజిగిరి జోన్లో కలిపింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు తలసాని. అలాగే సికింద్రాబాద్ పరిధిలోని పలు డివిజన్‌లను మల్కాజిగిరి జోన్ పరిధిలోని బోయిన్ పల్లి సర్కిల్‌లో చేర్చారని ఆరోపించారు. సికింద్రాబాద్ జీహెచ్‌ఎంసీలోనే ఉందంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన తప్పుడు ప్రకటన ప్రజలను మభ్యపెట్టడానికే అంటూ విమర్శించారు. 220ఏళ్ల చరిత్ర గల సికింద్రాబాద్ ఇమేజ్‌ను దెబ్బతీసే కుట్రలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం పోరాటం చేస్తున్నామని వివరించారు. సికింద్రాబాద్‌ను ప్రత్యేక కార్పొరేషన్‌గా ప్రకటించి తీరాల్సిందేనని మాజీ మంత్రి డిమాండ్ చేశారు.


శాంతి ర్యాలీ..

ఈ అంశంపై నిరసనగా ఈ నెల 17న భారీ శాంతి ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ ర్యాలీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమై క్లాక్ టవర్, ప్యాట్నీ, ప్యారడైజ్ మీదుగా ఎంజీ రోడ్‌లోని గాంధీ విగ్రహం వరకు సాగుతుందని వెల్లడించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి సికింద్రాబాద్ ప్రత్యేక కార్పొరేషన్ ప్రకటన సాధించేందుకు ఈ ర్యాలీ నిర్వహించనున్నట్లు తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

రాజేంద్రనగర్‌లో భారీ అగ్నిప్రమాదం..

కాంగ్రెస్‌లోకి కవిత ఎంట్రీపై పీసీసీ చీఫ్ క్లారిటీ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 13 , 2026 | 04:56 PM