మెహదీపట్నం లంగర్ హౌస్లో ఇటీవల ఒక ఫంక్షన్ హాల్లో వివాహ వేడుక జరిగింది. ఈ వేడుకలో తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
సీఎం రేవంత్ రెడ్డి విదేశీ టూర్ కు ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. రూ.10 వేల పూచికత్తుతో పాస్పోర్టు ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. అయితే మార్చి 3లోగా పాస్పోర్టు తిరిగి అప్పగించాలని కోర్టు ఆదేశించింది.
హైదరాబాద్ జీహెచ్ఎంసీలో వార్డుల సంఖ్య పెంచి సరిహద్దులు మార్చుతున్నారు. దీనిపై అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. నేటితో (డిసెంబర్ 17)తో ముగిసే అభ్యంతరాల సమర్పణ గడువును మరో రెండు రోజులు పొడిగిస్తూ కోర్టు ఆదేశించింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలను చూసి కాంగ్రెస్ నేతలకు మైండ్ బ్లాక్ అయ్యిందని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. మూడో దశ ఫలితాలు కూడా కాంగ్రెస్ పార్టీనీ నిరాశపరచక తప్పదని అన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో 16 మంది మావోయిస్టుల అరెస్ట్ను తెలంగాణ రాష్ట్ర కమిటీ ఖండించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ సంచలన లేఖను విడుదల చేసింది.
హైదరాబాద్ చందానగర్ రాజేందర్ రెడ్డి నగర్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. తొమ్మిదేళ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఐదు రోజుల పర్యటన నిమిత్తం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం హైదరాబాద్ చేరుకోనున్నారు. రేపు మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్ పోర్టుకు ఆమె చేరుకుంటారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మామ హైదరాబాద్ జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. తన హెల్త్ బీమా పాలసీకి సంబంధించి క్లెయిమ్ విషయంలో కంపెనీ వ్యవహరిస్తున్న తీరుపై ఆయన ఈ కేసు వేశారు.
హెరాల్డ్ కేసులో పోలీస్, ఆర్థిక నేరాల విభాగం దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసిందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. ఈ కేసులో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవని కోర్టు సైతం స్పష్టం చేసిందని ఆయన తెలిపారు.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు.. మూడు దశల్లో జరుగుతున్నాయి. రేపటితో అంటే డిసెంబర్ 17వ తేదీ మూడో దశతో ఈ ఎన్నికల ప్రక్రియ ముగియనుంది.