ఎస్‌ఎల్‌బీసీ దుర్ఘటనకు ఏడాది.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్..
ABN , Publish Date - Feb 21 , 2026 | 11:34 AM
ఎస్ఎల్‌బీసీ సొరంగం కుప్పకూలి ఏడాది కావొస్తున్నా కార్మికుల మృతదేహాలను వెలికితీయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కేటీఆర్ మండిపడ్డారు. చేతకాని పాలనకు పరాకాష్ట ఎస్ఎల్‌బీసీ దుర్ఘటన అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు.
హైదరాబాద్: సరిగ్గా ఏడాది కిందట ఫిబ్రవరి నెలలో ఎస్ఎల్‌బీసీ సొరంగం(SLBC Tunnel) కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఇద్దరి మృతదేహాలు వెలికి తీయగా.. మిగతా వారి జాడ తెలియరాలేదు. అప్పట్లో ఈ ఘటన తెలుగు రాష్ట్రాలో పెను సంచలనం సృష్టించింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ ఘటనలో కార్మికుల మృతదేహాలను వెలికితీయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) విఫలమైందని బీఆర్ఎస్(BRS) విమర్శలు చేస్తూనే ఉంది. కనీసం చివరిచూపు చూసే అవకాశం లేకుండా కార్మికుల కుటుంబాలను మానసిక క్షోభకు గురి చేసిందని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటన జరిగి సంవత్సరం పూర్తైన సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఏడాది గడుస్తున్నా మృతదేహాల వెలికితీతలో కానీ, సొరంగం పనుల్లో కానీ ఎటువంటి పురోగతి లేకపోవడం రేవంత్ నిర్లక్ష్యానికి, చేతకాని తనానికి నిదర్శనమని కేటీఆర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నాయకులు కమీషన్లు, కాంట్రాక్టులు, వాటాలపై పెట్టే శ్రద్ధ, ఇకనైనా కార్మిక సంక్షేమం, ప్రజా శ్రేయస్సుపై పెడితే ఇటువంటి విషాదాలు పునరావృతం కావని కేటీఆర్ మండిపడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి:
మెడికల్ పీజీ కోర్సులకు లైన్ క్లియర్
Read Latest Telangana News and National News