Home » BRS
Congress BRS clash: గౌతమ్ నగర్ కార్పొరేటర్ భర్త రాము యాదవ్పై కాంగ్రెస్ నేతలు దాడి చేయడంతో ఆయనకు గాయాలయ్యాయి. వెంటనే రామును ఆస్పత్రికి తరలించారు. విప్ బీర్ల ఐలయ్య నచ్చ చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఇరు వర్గాల నేతలు పట్టించుకోని పరిస్థితి.
ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నా.. ప్రస్తుత తరుణంలో జిల్లాకు చెందిన బీఆర్ఎస్ శ్రేణులు కానీ, రాష్ట్ర నాయకత్వం కానీ స్పందించకపోవడం చర్చనీయాంశం అవుతోంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేబినెట్ తీర్మానం చేయడంతో అందరి దృష్టి స్థానిక సంస్థలపై పడింది. పంచాయతీ పాలకవర్గాల గడువు ముగిసి సంవత్సరన్నరపైగా అవుతుండటం, పరిషత్ల గడువు ముగిసి సంవత్సరం పూర్తవుతుండటంతో ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే సందేహాలు అందరిలో నెలకొన్నాయి.
నిర్బంధాల నడుమ పండుగలు జరపడం సరికాదని సనత్నగర్ శాసనసభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాకాళి ఆలయం వద్ద ఆయన పర్యటించారు. ఆదివారం బోనాల సందర్భంగా అమ్మవారి దర్శనం సమయంలో తాము ఎదుర్కొన్న ఇబ్బందులను పలువురు భక్తులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
బీఆర్ఎస్ ఓ గూండా పార్టీలా వ్యవహరిస్తోందని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పేర్కొన్నారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సోమవారం సమావేశమయ్యారు.
పదేళ్ల పాటు అధికారంలో ఉండి తప్పు మీద తప్పు చేసిన బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తోందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు.
బీసీల ఉద్యమాన్ని ఆపాలనే కవిత కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ధ్వజమెత్తారు. కవిత, ఆమె ప్రేరేపిత గుండాలు చేసిన అరాచకంపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డికి ఫిర్యాదు చేశానని తెలిపారు. కవిత సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకంట్ల చంద్రశేఖర్రావుని నందినగర్ నివాసంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్రావు సోమవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. తాజా రాజకీయ పరిణామాలపై కేసీఆర్తో కేటీఆర్, హరీష్రావు చర్చించారు.
KTR Slams Congress Govt: అద్దాలమేడలో ఊరేగుతున్న అబద్దాల కాంగ్రెస్ మూలంగా అంధకారంలో తెలంగాణ రైతన్న ఆందోళన చెందుతున్నాడని కేటీఆర్ మండిపడ్డారు. దశాబ్దాల పాలనలో దండగ చేసిన వ్యవసాయాన్ని దశాబ్ద బీఆర్ఎస్ పాలనలో పండగ చేస్తే .. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో తిరిగి దండగ చేశారని విమర్శించారు.