మున్సిపాలిటీల కొత్త చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మెంబర్ల ప్రమాణ స్వీకారోత్సవాలు
ABN , Publish Date - Feb 16 , 2026 | 01:19 PM
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు, కౌంటింగ్ పర్వం, విజేతల వెల్లడి క్రతువు ముగిసిన ఇవాళ చివరి అంకానికి చేరింది. ఆయా మున్సిపల్ వార్డులకు చెందిన వివిధ పార్టీలకు చెందిన విజేతలు ఆయా మున్సిపల్ కార్యాలయాల్లో ప్రమాణస్వీకారాలు చేశారు. అనంతరం చైర్మన్లు, వైస్ చైర్మన్లను ఎన్నుకున్నారు. ఆ వివరాలు మీకోసం..
ఆంధ్రజ్యోతి, ఫిబ్రవరి 16: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు, కౌంటింగ్ పర్వం, విజేతల వెల్లడి క్రతువు ముగిసిన ఇవాళ చివరి అంకానికి చేరింది. ఆయా మున్సిపల్ వార్డులకు చెందిన వివిధ పార్టీలకు చెందిన విజేతలు ఆయా మున్సిపల్ కార్యాలయాల్లో ప్రమాణస్వీకారాలు చేశారు. అనంతరం చైర్మన్లు, వైస్ చైర్మన్లను ఎన్నుకున్నారు. ఆ వివరాలు మీకోసం..
జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపల్ చైర్మన్‌గా తిరుమల వసంత(కాంగ్రెస్)ఎన్నిక

సదాశివపేట మున్సిపల్ చైర్‌పర్సన్ అంజమ్మ

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ చైర్మన్‌గా.. 13వ వార్డు నుండి గెలిచిన సీఎం సురేష్ ఎన్నిక(BRS పార్టీ)

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ వైస్ చైర్మన్‌గా.. 8వ వార్డు నుండి గెలుపొందిన మాల నరసింహులు ఎన్నిక(BRS పార్టీ)

అలంపూర్ మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థిగా ఆరవ వార్డు కౌన్సిలర్ పిండి జయరాములు (బిఆర్ఎస్ పార్టీ)

ఆలంపూర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గా పదవ వార్డుకు ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థి ఎరుకలి విక్రమ్

షాద్‌నగర్ మున్సిపల్ చైర్మన్‌గా అగ్గనూర్ బసవేశ్వరు (కాంగ్రెస్ పార్టీ )

నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపల్ చైర్మన్‌గా నాగులపల్లి నరేందర్ (కాంగ్రెస్)

షాద్‌నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్‌గా అందే మోహన్ (కాంగ్రెస్ పార్టీ)

మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు బీఆర్ఎస్ కైవసం.. చైర్‌పర్సన్‌గా బొంది రజిని రవీందర్ గౌడ్, వైస్ చైర్మన్‌గా సమతా రెడ్డి ఎన్నిక.

వడ్డేపల్లి మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి నాయకి మంజుల ధర్మ

వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ చైర్మన్‌గా 9వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థి అక్కి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక

మెదక్ జిల్లా మెదక్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు కైవసం చేసుకున్న కాంగ్రెస్... చైర్ పర్సన్ గా కానుగు రాధిక భూపతి రాజ్, వైస్ చైర్మన్‌గా దొంతి నరేష్ ఎన్నిక

సంగారెడ్డి జిల్లా కోహీర్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు కాంగ్రెస్ పార్టీ కైవసం.. చైర్మన్‌గా ఎం అశోక్, వైస్ చైర్మన్‌గా మొహమ్మద్ అబ్దుల్ జావీద్ ఎన్నిక. ఎం ఐ ఎం, ఇండిపెండెంట్‌లు మద్దతు పలకడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు చైర్మన్, వైస్ చైర్మన్‌లుగా ఎన్నికయ్యేందుకు మార్గం సుగమం అయింది.

వడ్డేపల్లి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ శారద (AIFB)

ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ బండారి అనూష

మహబూబ్‌నగర్ జిల్లా బూత్పూర్ మున్సిపాలిటీ చైర్మన్‌గా 8వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ మూడవత్ బాలకోటి ఎన్నికయ్యారు.

మహబూబ్‌నగర్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌గా ఎం. సురేందర్ రెడ్డి ఎన్నికయ్యారు.

కేసముద్రం మున్సిపల్ చైర్ పర్సన్‌గా బానోత్ సునీత.

మరిపెడ మున్సిపల్ చైర్ పర్సన్‌గా కాంగ్రెస్ అభ్యర్థి వీసారపు ప్రగతి శ్రీపాల్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.

తెలంగాణ మంత్రి దామోదర రాజనర్సింహ ఇలాఖలో ఆందోల్ - జోగిపేట మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. చైర్మన్‌గా కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్‌గా ఆకుల సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

నారాయణపేట జిల్లా మద్దూర్ మున్సిపాల్టీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. చైర్మన్‌గా ఢిల్లీకర్ సరస్వతి ఎన్నికయ్యారు.

రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపల్ చైర్మన్‌గా కాంగ్రెస్ అభ్యర్థి పత్యా నాయక్ ఎన్నికయ్యారు.

రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపల్ వైస్ చైర్మన్‌గా బీజేపీ అభ్యర్థి గీతా ఆచారి ఎన్నికయ్యారు.

సంగారెడ్డి జిల్లాలోని ఇస్నాపూర్ మునిసిపల్ చైర్మన్ పదవిని బీఆర్ఎస్, వైస్ చైర్మన్ పదవిని కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన కౌన్సిలర్ ఎన్నికయ్యారు. మునిసిపల్ చైర్ పర్సన్‌గా సుమలత ( బీఆర్ఎస్) , వైస్ చైర్ పర్సన్‌గా మాధవి రెడ్డి ఎన్నికయ్యారు. ఎంపీ రఘునందన్ రావు, పఠాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఎక్స్ అఫిషియో ఓట్లతో బీఆర్‌ఎస్ దక్కించుకుంది.

సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. చైర్ పర్సన్‌గా కూన వనిత, వైస్ చైర్మన్‌గా షఫీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

మెదక్ జిల్లా రామాయంపేట చైర్ పర్సన్‌గా లావణ్య ఎన్నికయ్యారు.

వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపల్ చైర్మన్‌గా నందరం ప్రశాంత్ 4వ వార్డు నుంచి ఎన్నికయ్యారు.

షాద్‌నగర్ మున్సిపల్ చైర్మన్‌గా అగ్గనూర్ బస్వాం ఎన్నికయ్యారు.

షాద్‌నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్‌గా అందెమోహన్ ఎన్నికయ్యారు.

మక్తల్ మున్సిపల్ చైర్మన్‌గా కాంగ్రెస్ అభ్యర్థి వాకిటి మానస14 వ వార్డు నుంచి ఎన్నికయ్యారు.

మక్తల్ మున్సిపల్ వైస్ చైర్మన్‌గా కాంగ్రెస్ అభ్యర్థి శైవీరెడ్డి 9వ వార్డు నుంచి ఎన్నికయ్యారు.

వనపర్తి జిల్లాలోని కొత్తకోట మున్సిపల్ చైర్మన్‌గా కాంగ్రెస్ అభ్యర్థి అరుణ శ్రీనివాస్ 9వ వార్డు నుంచి ఎన్నికయ్యారు.

వనపర్తి జిల్లాలోని కొత్తకోట మున్సిపల్ వైస్ చైర్మన్‌గా కాంగ్రెస్ అభ్యర్థి పల్లవి కృష్ణారెడ్డి 13వ వార్డు నుంచి ఎన్నికయ్యారు.

వనపర్తి మున్సిపల్ చైర్మన్‌గా మీడిదొడ్డి మాధవి ఎన్నికయ్యారు. ఈ రోజు ఆమె ప్రమాణ స్వీకారం చేశారు.

వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్‌గా గుర్రకొండ మధుసూదన్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈరోజు ఆయన ప్రమాణ స్వీకారం చేశారు.

సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ చైర్మన్‌గా బీఆర్ఎస్ అభ్యర్థి జనార్దన్ ఎన్నికయ్యారు.

జగిత్యాల జిల్లా రాయికల్ మున్సిపాల్ చైర్మన్‌గా రవి ఎన్నికయ్యారు.

వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపల్ చైర్ పర్సన్‌గా గోపాల నాగమణి ఎన్నికయ్యారు.

మహబూబ్‌నగర్ జిల్లాలోని దేవరకద్ర మున్సిపాలిటీ తొలి చైర్ పర్సన్‌గా దమయంతి ఎన్నికయ్యారు.

కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట మున్సిపాలిటీ చైర్మన్‌గా బీఆర్ఎస్ అభ్యర్థి మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) ఎన్నికయ్యారు.

సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. చైర్మన్‌గా నగేశ్ షెట్కార్, వైస్ చైర్మన్‌గా దారం శంకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ సోదరుడే నగేశ్ షెట్కార్ కావడం గమనార్హం.
