Home » BJP
సర్వేనెంబర్ ఒక దగ్గర ఉంటే మరొక దగ్గర నిర్మాణాలు జరుగుతున్నాయి. ఆక్రమణకు గురవుతున్న 4 ఎకరాలకు పైగా రూ.100 కోట్లకు పైగా విలువ చేసే ప్రభుత్వ భూమిని కాపాడాలని బీజేపీ(BJP) నాయకులు ఆకుల సతీష్, పీసరి కృష్ణారెడ్డి, మల్లారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, అరుణ్‌రావు, కుమార్‌గౌడ్, ఎల్లస్వామి మేడ్చల్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
ఎన్నికల్లో సంపన్న వ్యక్తులు పోటీ చేయడం సాధారణమే. అయితే హర్యానా ఎన్నికల్లో మాత్రం రికార్డు స్థాయి ఆస్తి ఉన్న ఒక మహిళ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు. ఆమె ఎవరో కాదు బీజేపీ కురుక్షేత్ర ఎంపీ నవీన్ జిందాల్ తల్లి సావిత్రి జిందాల్. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని కొంతకాలంగా ఎదురుచూసిన ఆమె బీజేపీ టికెట్ ఆశించారు.
‘విదేశాల్లో భారత్‌ను కించపర్చేలా వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీకి ఈ దేశంలో ఉండే అర్హత లేదు. సిక్కులను ఊచకోత కోసిన చరిత్ర కాంగ్రెస్ సొంతం.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అత్యాచార ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నా ఆ పార్టీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని లోక్ సభపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) విమర్శించారు.
‘‘హైదరాబాద్‌లో ‘హైడ్రా’ చేపడుతున్న కూల్చివేతల తీరు సరికాదు. అక్రమ నిర్మాణాలంటూ.. కట్టడాలను కూల్చివేయిస్తుండడాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హీరోయిజం అనుకుంటున్నారు.
మాజీ సీఎం కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో పెట్టడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సాధ్యం కావడం లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.
లోక్ సభ విపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) అమెరికా పర్యటనలో.. సిక్కులపై చేసిన వ్యా్ఖ్యలను బీజేపీ నేతలు ఖండిస్తున్నారు. రాహుల్ వ్యాఖ్యలు సిక్కు సమాజాన్ని అవమానించే విధంగా ఉన్నాయంటూ ఆ పార్టీ సిక్కు సెల్ సభ్యులు ఆరోపించారు.
Telangana: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల హ్యాంగోవర్ నుంచి బయటపడ్డట్టు లేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా పర్యటనలో దేశం, ప్రజాస్వామ్యం పట్ల భారత దేశప్రజలను అవమానించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. మోదీ, బీజేపీ వల్ల ప్రధాని కాలేదనే అక్కసుతో దేశం మీద విషం చిమ్ముతున్నారన్నారు.
Telangana: గణేష్ నిమిజ్జనంపై పోలీస్ కమిషనర్‌కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు. గత నిమజ్జన సమయంలో చాలామంది మద్యం సేవించి అసభ్యకరంగా ప్రవర్తించారని గుర్తుచేశారు. సోషల్ మీడియాలో ఆ వీడియోస్ వైరల్ కూడా అయ్యాయని తెలిపారు. గణేష్ నిమజ్జనం సమయంలో ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే వారిపైన చర్యలు తీసుకోవాలని కోరారు.
Telangana: ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరతతో పాటు సిబ్బంది సమస్యలు బాగా ఉన్నాయని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. బుధవారం నల్గొండ బీజేపీ కార్యాలయంలో మీడియాతో ఎంపీ మాట్లాడుతూ.. వరుస వర్షాలతో వైరల్ ఫీవర్స్ వ్యాపిస్తున్నాయని.. గ్రామాలకు వైరస్ పాకుతోందన్నారు.