Share News

కాంగ్రెస్ దౌర్జన్యంతో గెలిచింది: రాంచందర్ రావు

ABN , Publish Date - Feb 13 , 2026 | 06:17 PM

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు మీడియా మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ దౌర్జన్యంతో గెలిచింది: రాంచందర్ రావు
Telangana Municipal Elections,

హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు స్పందించారు. బీజేపీని ఓడించేందుకు ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయంటూ ఆరోపించారు. 'మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఓట్ల శాతం పెరిగింది. దాదాపు 350 వార్డుల్లో మనం సత్తా చాటబోతున్నాం. అధికార దుర్వినియోగం, పోలీసుల దౌర్జన్యంతో కాంగ్రెస్‌ గెలిచింది.


నారాయణపేట, ఆదిలాబాద్‌, కొత్తగూడెం, వైరాలో తొలిసారి విజయం సాధించాం. చాలా వార్డుల్లో 2 నుంచి 25 ఓట్ల తేడాతో ఓడిపోయాం. ఈ ఎన్నికల్లో బీజేపీ బలం పెరిగింది.. BRS ఓట్ల శాతం తగ్గింది. 20 శాతం ఓట్లు బీజేపీకి పెరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ నైతికంగా విజయం సాధించింది. ఈ ఫలితాలు అధికార పార్టీకి హెచ్చరిక. క్షేత్రస్థాయిలో బీజేపీ బలం పుంజుకుంది’ అని అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మున్సిప‌ల్ ఎన్నిక‌లు.. ప్రజ‌లు కాంగ్రెస్‌కు బ్రహ్మర‌థం ప‌ట్టారు: మంత్రి జూప‌ల్లి

ఎన్నికల్లో ఓడిపోయామని బాధపడకండి.. గులాబీ శ్రేణులకు ధైర్యం చెప్పిన కేటీఆర్

Updated Date - Feb 13 , 2026 | 06:24 PM