Share News

మున్సిప‌ల్ ఎన్నిక‌లు.. ప్రజ‌లు కాంగ్రెస్‌కు బ్రహ్మర‌థం ప‌ట్టారు: మంత్రి జూప‌ల్లి

ABN , Publish Date - Feb 13 , 2026 | 05:09 PM

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. హస్తం పార్టీ విజయంపై రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు.

మున్సిప‌ల్ ఎన్నిక‌లు.. ప్రజ‌లు కాంగ్రెస్‌కు బ్రహ్మర‌థం ప‌ట్టారు: మంత్రి జూప‌ల్లి
Telangana Minister Jupally Krishna Rao

హైదరాబాద్, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. హస్తం పార్టీ విజయంపై తెలంగాణ ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు(Telangana Minister Jupally Krishna Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్ వేదికగా మంత్రి జూప‌ల్లి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌పై న‌మ్మకంతో మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ప్రజ‌లు స్పష్టమైన తీర్పు ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఎన్నిక‌లు ఏవైనా విజ‌యం కాంగ్రెస్‌దేనని మరోసారి రుజువైందన్నారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ప్రజ‌లు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మర‌థం ప‌ట్టారన్నారు.


సీఎం రేవంత్ రెడ్డి సార‌థ్యంలోని ప్రజా ప్రభుత్వ ప‌నితీరుకు ఈ ఫ‌లితాలే నిద‌ర్శనమని మంత్రి జూప‌ల్లి కృష్ణారావు చెప్పుకొచ్చారు. తమ పాల‌న ప‌ట్ల ప్రజ‌లు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. ఇది కాంగ్రెస్ పార్టీ శ్రేణుల స‌మష్టి విజ‌యమన్నారు. ప్రతిప‌క్షాల విమ‌ర్శల‌ను ప్రజ‌లు ప‌ట్టించుకోవ‌డం లేదని చెప్పుకొచ్చారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నిక‌ల్లోనూ ప్రజ‌లు ఇదే తీర్పును ఇవ్వబోతున్నారని తెలిపారు. ఉమ్మడి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో అత్యధిక మున్సిప‌ల్ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుందని తెలిపారు. కొల్లాపూర్ మున్సిపాలిటీలో 19 స్థానాల‌కు 16 స్థానాల‌ను కాంగ్రెస్ కైవ‌సం చేసుకుందని మంత్రి జూప‌ల్లి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

'ఓ కాంగ్రెస్ ప్రభుత్వమా.. మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎక్కడ?'

మున్సిపల్ ఎన్నికల అప్‌డేట్స్.. 52 వార్డులు కాంగ్రెస్ కైవసం

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 13 , 2026 | 05:18 PM