మున్సిపల్ ఎన్నికల అప్‌డేట్స్.. 52 వార్డులు కాంగ్రెస్ కైవసం
ABN , Publish Date - Feb 13 , 2026 | 12:24 PM
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్ర ఎన్నికల సంఘం 80 వార్డులకు సంబంధించిన ఫలితాలను ప్రకటించింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్ర ఎన్నికల సంఘం 80 వార్డులకు సంబంధించిన ఫలితాలను ప్రకటించింది. ఈ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. మొత్తం 80 వార్డుల్లో 52 వార్డులను కాంగ్రెస్ కైవసం చేసుకోవడం విశేషం. మిగిలిన వార్డుల్లో బీఆర్ఎస్, బీజేపీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు, ఇతరులు ఆయా స్థానాలను దక్కించుకున్నారు. ఈ ఫలితాలు రాష్ట్ర రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఓటర్ల అభిప్రాయం ఏ దిశగా ఉందో ఈ ఫలితాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి.
కాంగ్రెస్‌కి భారీ విజయం..
ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 52 వార్డులను గెలుచుకుని ముందంజలో నిలిచింది. పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, స్థానిక సమస్యల పరిష్కారం వంటి అంశాలపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటర్లు మద్దతు ఇచ్చినట్లు కాంగ్రెస్ అభ్యర్థులు భావిస్తున్నారు. ఈ విజయంతో కాంగ్రెస్ నాయకత్వానికి మరింత బలం చేకూరింది. రాష్ట్ర స్థాయిలో పార్టీకి ఇదొక సానుకూల సంకేతంగా మారింది. భవిష్యత్తు ఎన్నికల వ్యూహాలకు ఈ ఫలితాలు దారితీయనున్నాయని కాంగ్రెస్ అభ్యర్థులు చెబుతున్నారు.
రెండో స్థానంలో బీఆర్ఎస్..
ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ 21 వార్డులను కైవసం చేసుకుంది. గత ఎన్నికలతో పోలిస్తే కొన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బ తగిలినప్పటికీ.. పట్టణాల్లో తమ ఓటు బ్యాంక్‌ను నిలబెట్టుకునే ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ నేతలు స్థానిక అభివృద్ధి అంశాలపై ప్రచారం చేసినప్పటికీ.. కొన్ని వార్డుల్లో తీవ్ర పోటీ ఎదురైంది. అయినప్పటికీ 21 వార్డుల్లో విజయం సాధించడం ఆ పార్టీకి ఊరటనిచ్చేదే.
మూడు వార్డుల్లో బీజేపీ..
ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ 3 వార్డులను గెలుచుకుంది. పట్టణాల్లో తమ ప్రభావాన్ని పెంచుకోవాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి ఇది చిన్న స్థాయి విజయం అయినప్పటికీ.. భవిష్యత్తు విస్తరణకు ఇది పునాది అని కమలం పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇండిపెండెంట్ అభ్యర్థుల ప్రభావం..
స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించడం గమనార్హం. స్థానికంగా బలమైన నాయకత్వం, వ్యక్తిగత ప్రజాభిమానంతో వారు గెలిచినట్లు తెలుస్తోంది. ఇది ప్రధాన పార్టీలకు ఒక హెచ్చరికగానూ భావించవచ్చు.
ఇతరులకు ఒక వార్డు..
ఒక వార్డులో ఇతర పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. ఇది స్థానిక రాజకీయ పరిస్థితుల ప్రభావం వల్ల జరిగిన ఫలితంగా రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. మొత్తంగా 80 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధించడం రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా నిలిచింది. బీఆర్ఎస్ రెండో స్థానంలో నిలవగా, బీజేపీ, ఇండిపెండెంట్లు, ఇతరులు పరిమిత స్థాయిలో విజయాలు సాధించారు.
మొత్తం ఫలితాల విశ్లేషణ:
కాంగ్రెస్ – 52 వార్డులు
బీఆర్ఎస్ – 21 వార్డులు
బీజేపీ – 3 వార్డులు
ఇండిపెండెంట్లు – 3 వార్డులు
ఇతరులు – 1 వార్డు
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ మున్సిపల్ కౌంటింగ్: వరంగల్, నిజామాబాద్‌లలో క్యాంప్ పాలిటిక్స్ హీట్!
గ్రామ పంచాయతీలకు కేంద్రం శుభవార్త..
Read Latest Telangana News And AP News And Telugu News