Home » Telangana
వాజేడు ఎస్సై రుద్రారపు హరీశ్ ఆత్మహత్య కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. ఆత్మహత్య సమయంలో అతడి వద్దే ఉన్న యువతి.. తమ మధ్య ఉన్న సంబంధంపై ఆదివారం పలు విషయాలు వెల్లడించింది.
ఛత్తీ్‌సగఢ్‌లో మావోయిస్టులు మళ్లీ రెచ్చిపోయారు. బీజాపూర్ జిల్లా పామేడు పోలీ్‌సస్టేషన్ పరిధిలోని జీడిపల్లి రెండో పోలీస్ క్యాంప్‌పై శనివారం అర్ధరాత్రి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు.
చాలా మెడికల్ కాలేజీలు తమ బోధనాస్పత్రుల్లో రోగులు లేకపోయినా... ‘బెడ్ ఆక్యుపెన్సీ’ కోసం నకిలీ రోగులను చూపిస్తుండడాన్ని జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) తీవ్రంగా పరిగణిస్తోంది.
రాష్ట్రంలో చిన్నాభిన్నమైన రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో రెవెన్యూ ఉద్యోగులందరం భాగస్వాములమవుతామని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి తెలిపారు.
ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సోమవారం సచివాలయంలో తలపెట్టిన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పిలుపునిచ్చారు.
ఆధునిక సాంకేతికత ద్వారా రైతులకు మెరుగైన సేవలు దక్కేలా, మహిళా సాధికారత, యువత నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేస్తామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం సాయంత్రం 6.05 గంటలకు సచివాలయంలో దాదాపు లక్ష మంది మహిళల సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
ఒక విమనానికి మరో విమానం తాకుతుందేమో అన్నట్టుగా అత్యంత సమీపంలో తొమ్మిది విమానాలు గాల్లో వరుసగా ఎగురుతుంటే?
కాంగ్రెస్ ఎన్నికల హామీలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు పట్టుబడతామని బీజేఎల్పీ ఉపనేత పాయల శంకర్ తెలిపారు. ఏడాది పాలనలో ప్రభు త్వ వైఫల్యాలను ఎండగడతామని చెప్పారు.
రాష్ట్రంలో టీజీఎండీసీ సహకారంతో ములుగు, కొత్తగూడెం, పెద్దపల్లి ఇసుక క్వారీలలో కొందరు అక్రమార్కులు బకెట్ దందాకు పాల్పడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని తెలంగాణ మైన్స్ అండ్ సాండ్ లారీ అసోసియేషన్ ఆరోపించింది.