Share News

గుట్టువిప్పరు..కారణాలు చెప్పరు?

ABN , Publish Date - Feb 21 , 2026 | 07:59 AM

ఇద్దరు పిల్లలతో కలిసి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ విజయారెడ్డి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చి 20 రోజులు గడుస్తోంది. ఇప్పటి వరకు కేసు మిస్టరీ వీడలేదు.

గుట్టువిప్పరు..కారణాలు చెప్పరు?

  • విజయారెడ్డి కేసులో తాత్సారం

  • 20 రోజులు గడుస్తున్నా తేల్చని సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులు

హైదరాబాద్‌ సిటీ: ఇద్దరు పిల్లలతో కలిసి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ విజయారెడ్డి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చి 20 రోజులు గడుస్తోంది. ఇప్పటి వరకు కేసు మిస్టరీ వీడలేదు. రెండు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసు విచారణలో సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులు తీవ్ర తాత్సారం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఐటీ కంపెనీలో టీమ్‌ లీడర్‌ హోదాలో పనిచేస్తున్న ఆమెకు కుటుంబ కలహాలు గానీ, ఆర్థిక ఇబ్బందులు గానీ లేని విజయారెడ్డి ఇంటర్‌ చదువుతున్న ఇద్దరు పిల్లలతో కలిసి ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను పోలీసులు తేల్చలేకపోయారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.


city3.2.jpgగుట్టు విప్పని పోలీసులు..

జనవరి 28న విజయారెడ్డి-సురేందర్‌రెడ్డి(Vijaya Reddy-Surender Reddy)ల పెళ్లి రోజు. జనవరి-31న భర్త సురేందర్‌రెడ్డి పుట్టినరోజు. వారి పెళ్లిరోజుకు, భర్త పుట్టిన రోజుకు మధ్య కేవలం రెండు రోజులు గ్యాప్‌లోనే ఆమె ఆత్మహత్య చేసుకోవాలనే కఠిన నిర్ణయం ఎందుకు తీసుకుంది? ఆ రెండు రోజుల్లో ఏం జరిగింది? ఫోన్‌, ల్యాప్‌టాప్‏ను ఎఫ్‌ఎస్ఎల్‌కు పంపిన పోలీసులు ఆ తర్వాత వచ్చిన రిపోర్టులో ఏం తేల్చారు? కాల్‌డేటాలో ఏం తెలిసింది..? బలవన్మరణానికి ప్రోత్సహించిన కారణాలు ఏంటి..? అనేది పోలీసులు వెల్లడించలేదు. పోలీసులు కావాలనే గుట్టువిప్పడం లేదా? లేదంటే పోలీసులపై మరేదైనా ఒత్తిడి ఉందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

మెడికల్‌ పీజీ కోర్సులకు లైన్‌ క్లియర్‌

చరిత్రను తిరగరాసిన సరిత

Read Latest Telangana News and National News

Updated Date - Feb 21 , 2026 | 07:59 AM